తమిళ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న దళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే దళపతి విజయ్ ప్రస్తుతం వరిసు అనే మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటు వంటి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తూ ఉండగా , దిల్ రాజు ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. రష్మిక మందన ఈ మూవీ లో విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , సన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు.
ఇది ఇలా ఉంటే ఈ మూవీ ని తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని తమిళ్ లో రూపొందిస్తూ ఉండగా , తెలుగు లో ఈ మూవీ ని డబ్ చేసి విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ ని తమిళ్ లో వరిసు అనే పేరుతో విడుదల చేయనుండగా , తెలుగు లో వారసుడు అనే పేరుతో విడుదల చేయనున్నారు. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి "రంజితమే" అనే ఫస్ట్ సాంగ్ కు సంబంధించిన ప్రోమో ను విడుదల చేసింది.
ఈ ప్రోమో సాంగ్ అద్భుతమైన రేంజ్ లో ఉండడంతో ప్రస్తుతం వరిసు మూవీ ఫస్ట్ సాంగ్ ప్రోమో కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభిస్తుంది. ఇది ఇలా ఉంటే వరిసు మూవీ నుండి "రంజితమే" ఫుల్ సాంగ్ ను నవంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది మరి రంజితమే ఫుల్ సాంగ్ ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే.