క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కృష్ణ వంశీ ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో వైవిధ్యమైన మూవీ లకు దర్శకత్వం వహించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దర్శకుడు గా తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తన కంటూ ఒక అద్భుతమైన గుర్తింపు ను దర్శకుడి గా ఏర్పరచుకున్న కృష్ణ వంశీ 2007 వ సంవత్సరంలో విడుదల అయిన చందమామ మూవీ తర్వాత మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకో లేక పోయాడు.
చందమామ సినిమాలో శివ బాలాజీ , నవదీప్ హీరోలుగా నటించగా కాజల్ అగర్వాల్ , సింధు మీనన్ హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదలై ఆ సమయంలో బాక్సా ఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తరువాత కృష్ణ వంశీ పలు మూవీ లకు దర్శకత్వం వహించినప్పటికీ , ఆ మూవీ లు ఏవి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర చెప్పు కోదగ్గ విజయాలను సాధించ లేదు. ఇది ఇలా ఉంటే వరుస అపజయాలతో బాక్సా ఫీస్ దగ్గర డీల పడిపోయిన కృష్ణ వంశీ ప్రస్తుతం రంగ మార్తాండ అనే మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ మరాఠీ సినిమా నట సామ్రాట్ అనే మూవీ కి అధికారిక రీమేక్ గా తెరకెక్కుతుంది.
ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ , రమ్య కృష్ణ , బ్రహ్మానందం ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా కృష్ణ వంశీ తన సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను తెలియజేశాడు. ఈ మూవీ లో ముఖ్య పాత్రలో నటిస్తున్న రమ్య కృష్ణ ఈ మూవీ కి సంబంధించిన తన పాత్ర డబ్బింగ్ ను ప్రారంభించినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటిస్తూ కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.