బ్రహ్మాస్త్ర - 2' లో హీరో గా నటించబోతున్న KGF హీరో....!!

murali krishna
KGF సిరీస్ లో హీరో గా నటించిన రాకింగ్ స్టార్ యాష్ కి ప్రపాంచవ్యాప్తంగా ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడిందో మన అందరికి తెలిసిందే..ముఖ్యంగా బాలీవుడ్ లో ఈయనకి ఖాన్స్ తో సమానమైన క్రేజ్ వచ్చేసింది..'రాకీ భాయ్' అనేది ముంబై లో ఒక బ్రాండ్ గా మారిపోయింది..అలాంటి స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత కూడా యాష్ తన తదుపరి చిత్రం ఏది చెయ్యాలి అనేది ఇప్పటికి ఖారారు చెయ్యలేదు..ఆయన అభిమానులేమో ఎప్పుడెప్పుడు తమ అభిమాన హీరో కొత్త ప్రాజెక్ట్ గురించి చెప్తాడో అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.
టాలీవుడ్ , బాలీవుడ్ మరియు కోలీవుడ్ అని తేడా లేకుండా ప్రతి ఇండస్ట్రీ నుండి టాప్ స్టార్ డైరెక్టర్స్ యాష్ ఇంటి ముందు క్యూ కడునప్పటికీ కూడా యాష్ ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు..స్క్రిప్ట్ kgf ని తలదన్నే రేంజ్ లో ఉంటేనే అంగీకరించాలని..అలాంటి కథ కోసమే ఎదురు చూస్తున్నాను అని ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడు యాష్.

అయితే బాలీవుడ్ వర్గాల్లో గత కొద్దీ రోజుల నుండి ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది..అదేమిటి అంటే బాలీవుడ్ లో ఎంతో ప్రతిష్టంకంగా తెరకెక్కి ఈ ఏడాది విడుదలైన చిత్రం బ్రహ్మాస్త్ర..భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం అన్ని ప్రాంతీయ భాషలకు కలిపి సుమారుగా 450 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది..ఇక ఈ సినిమాకి సీక్వెల్ అతి త్వరలోనే తెరకెక్కించబోనున్నాం అని ఆ మూవీ టీం ఇప్పటికే అధికారిక ప్రకటన చేసిన సంగతి మన అందరికి తెలిసిందే..అయితే మొదటి భాగం లో హీరో రణబీర్ కపూర్ కాగా..రెండవ పార్ట్ కోసం హీరో గా యాష్ ని అడుగబోతున్నట్టు సమాచారం..ఇటీవలే బ్రహ్మాస్త్ర టీం యాష్ ని కలవడానికి కర్ణాటక కి వెళ్లినట్టు సమాచారం.మరి యాష్ ఈ ప్రాజెక్ట్ లో నటించడానికి ఒప్పుకుంటాడా లేదా అనేది చూడాలి..బాలీవుడ్ లో సీక్వెల్స్ కి మాములు క్రేజ్ ఉండదు..కేవలం 40 కోట్లు వసూలు చేసిన kgf సినిమాకి సీక్వెల్ చేసి విడుదల చేస్తే కేవలం బాలీవుడ్ నుండే 450 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి..ఇప్పుడు బ్రహ్మాస్త్ర పార్ట్ 2 కి కూడా యాష్ హీరో గా చేస్తే అదే రేంజ్ ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: