పూరి జగన్నాథ్ కార్నర్ కాబోతున్నడా ?

Seetha Sailaja

ఒక భయంకరమైన ఫ్లాప్ ఎంతటి గొప్ప వ్యక్తిని అయినా ఒక కుదుపు ఎలా కుదురుతుందో ఆమధ్య రిలీజ్ అయి విజయ్ దేవరకొండ అభిమానులు కూడ భరించలేకపోయిన ‘లైగర్’ పరాజయం తెలియచేస్తుంది. ‘ఇస్మార్ట్ శంకర్’ ఘన విజయం తరువాత పూరీజగన్నాథ్ తిరిగి ట్రాక్ లోకి వచ్చాడు అని అనుకున్నారు అంతా.


అయితే ఆ ఘన విజయం ఇచ్చిన జోష్ తో ఏమాత్రం ఆలోచన చేయకుండా ఒక పాత కథను ఎంచుకుని విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా మూవీగా తీసిన ‘లైగర్’ ను చూసిన సగటు ప్రేక్షకుడు ఈ సినిమాను నిజంగానే పూరీ జగన్నాథ్ తీసాడా లేదంటే అతడి పేరుమీద మరెవరైనా తీసారా అంటూ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలకు ముందు ఏర్పడిన క్రేజ్ తో తెలుగు రాష్ట్రాలలో ఈమూవీ పై భారీ బిజినెస్ జరిగింది.


ఈ మూవీ భారీ ఫ్లాప్ గా మారడంతో బయ్యర్లు పెట్టిన మొత్తంలో కనీసం సగం కూడ రాలేదు అన్నవార్తలు వినిపించాయి. అయితే ఈ మూవీ బయ్యర్లను పూరీజగన్నాథ్ తన దగ్గరకు పిలిపించుకుని వారికి తన సొంత డబ్బుతో కొంత సద్దుబాటు చేసాడని వార్తలు వచ్చాయి. అయితే అది అంతా కేవలం మాటలు మాత్రమే కాని వాస్తవ రూపం దాల్చలేదు అని తెలుస్తోంది. దీనితో కొందరు బయ్యర్లు పూరీ పై అసహనంతో ఉన్నారని కొందరి మధ్య వర్తుల ద్వారా సెటిల్మెంట్ కు ప్రయత్నిస్తున్నారని అది కుదరకపోతే మీడియాకు ఎక్కి తమ గోడును వెల్లడించాలని ఆలోచనలు చేస్తున్నారు అంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.


ఈవార్తలలో ఎన్ని నిజాలో తెలియకపోయినప్పటికీ ఎందరో హీరోలకు సూపర్ హిట్స్ ఇచ్చిన పూరీజగన్నాథ్ కు ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏమిటి అంటూ అతడి అభిమానులు సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న ఈ గాసిప్పులను చూసి బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే పూరీ రామ్ తో ఒక సినిమా చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: