ఓరి దేవుడా..ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడేనా?

Satvika
విశ్వక్ సేన్..ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. ఎటువంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా తన టా లెంట్ తో మంచి సక్సెస్ ను అందుకున్నాడు..అతడు ఇప్పటివరకు చేసిన రెండు, మూడు సినిమాలే అతనికి మంచి హిట్ ను అందించాయి.అంతే జోష్ తో అతను వరుస సినిమాల లో నటిస్తూ వస్తున్నాడు.తాజాగా అతడు నటించిన సినిమా ఓరి దేవుడా...డైరెక్టర్ అశ్వథ్ మారిముత్తు తెరకెక్కించిన ఓరి దేవుడా చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్, మిథిలా పాల్కర్ జంటగా నటించిన ఈ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


మొదటి షో తోనే మంచి టాక్ ను అందుకుంది..అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ఇందులో విక్టరి వెంకటేష్ , ఆశాభట్ కీలకపాత్రలలో కనిపించారు. నిన్న ఉదయం నుంచే ఓరి దేవుడా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అయితే ఈ మూవీ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. అప్పుడే ఈ ఓటీటీ పార్టనర్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ విషయం పై అధికారిక ప్రకటన రానుంది.


రొమాంటిక్ కామెడీ.. డ్రామా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహా సొంతం చేసుకున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ ను పీవీపీ .. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి.చిన్ననాటి నుంచి స్నేహితులుగా పెరిగిన యువతీయువకుడు అనుకోని పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాల్సి రావడం.. ఆ తర్వాత వారిద్దరి జీవితాల్లో ఎదురైన పరిస్థితులు.. దీంతో విడాకులు తీసుకోవడానికి సిద్ధపడిపోతారు. అదే సమయంలో వారిమధ్య ఓ అపరిచిత వ్యక్తి ఎంటర్ కావడంతో వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగిందనేది ఓరి దేవుడా చిత్రం..మొత్తానికి మనోడికి ఈ సినిమా కూడా మంచి టాక్ ను అందించింది...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: