"ఎన్ బి కె 107" మూవీ సాటిలైట్ హక్కులను దక్కించుకున్న ప్రముఖ సంస్థ..?

Pulgam Srinivas
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరు అయినటువంటి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. కొంత కాలం క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం ఒక టీజర్ ను విడుదల చేయగా , ఆ టీజర్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.


ఈ మూవీ లో శృతి హాసన్ బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , వరలక్ష్మీ శరత్ కుమార్ ఈ మూవీ లో ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతోంది. దునియా విజయ్ ఈ మూవీ లో విలన్ గా కనిపించనుండగా , ఎస్ ఎస్ తమన్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమా యూనిట్ ఈ మూవీ కి టైటిల్ ని ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ యూనిట్ ఎన్ బి కె 107 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ చిత్రీకరణను జరుపుతోంది.


ఇది ఎలా ఉంటే ఈ రోజు అనగా అక్టోబర్ 21 వ తేదీన ఈ మూవీ టైటిల్ ను మూవీ యూనిట్ అధికారికంగా విడుదల చేయనుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా చిత్ర బృందం చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ సాటిలైట్ హక్కులకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ సాటిలైట్ హక్కులను స్టార్ మా ఛానల్ వారు భారీ ధరకు దక్కించుకున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై బాలకృష్ణ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: