నవీన్ పోలిశెట్టి హీరోగా "జాతి రత్నాలు" సినిమా హిట్ తో హీరో రేంజ్ లో క్రేజ్ సంపాదించిన యంగ్ డైరెక్టర్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో వచ్చిన "ప్రిన్స్" సినిమా మొదటి షో నుంచే బ్లాక్ బస్టర్ హిట్ సాధించి, ప్రేక్షకులను ఆకట్టుకున్నట్టు సమాచారం తెలుస్తుంది.తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్, ఇంకా ఉక్రైన్ దేశానికి చెందిన మోడల్ మరియా ఈ సినిమాలో హీరో హీరోయిన్లుగా నటించారు.ఇక ఈసినిమా శుక్రవారం (నేడు) థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. నారాయణ్ దాస్ నారంగ్ ఆశీస్సులతో సునీల్ నారంగ్, డి.సురేష్ బాబు, పుస్కుర్ రామ్‌మోహన్‌రావు సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పి, సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు. సోనాలి నారంగ్ ఈ చిత్రాన్ని సమర్పించారు. మూవీ కథలోకి వెళ్తే.. శివ కార్తికేయన్ తను పనిచే పాఠశాలలోనే ఇంగ్లీష్ టీచర్ రబోషప్కతో ప్రేమలో పడుతాడు. ఆమెను ఎంతో ఇష్టపడుతున్న శివ, తనకు తన ప్రేమ తెలియజేయడానికి నానా పాట్లు పడుతాడు.
ఇక చివరికి ఆ టీచర్‌ను ఎలా దక్కించుకున్నాడు అనేది కథ.. అయితే ఈ సినిమా ప్రీమియర్ షో ముగియడంతో.. ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తుంది.హీరో, శివ కార్తికేయన్‌కు, హీరోయిన్ నటనకు మంచి మార్కులు వేస్తున్నారు అభిమానులు. ఇక శివకామెడీ సినిమాకు హైలెట్‌గా చెప్పవచ్చునంట. మ్యూజిక్, యాక్షన్ సన్నివేశాలు పరవాలేదు అనేలా ఉండగా, అనుదీప్ నుంచి ఎక్స్ పెక్ట్ చేసిన కామెడీ లేదంటూ కొందరు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అలాగే కథ, కథనం ప్రేక్షకులను నిరాశపరిచినట్లు తెలుస్తుంది.ఇవన్నీ పక్కన పెడితే సినిమాలో నటించిన శివ కార్తికేయన్, మరియా పెర్ఫార్మన్స్ అయితే సూపర్ అని ప్రేక్షకుల నుంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా మరియా అందానికి యూత్ ఫిదా అవుతున్నారు.మొత్తానికి కథ పరంగా అనుదీప్ కొంచెం నిరాశపరిచినా కానీ హీరో హీరోయిన్లతో సినిమాని బాగానే హ్యాండిల్ చేసి హిట్ అందుకున్నాడు. ఇక వసూళ్లు ఎలా వస్తాయో చూడాలి.