టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈసారి చాలా గ్యాప్ తీసుకున్నాడు యంగ్ హీరో సందీప్ కిషన్. వరుసగా ఫెయిల్యూర్స్ ఫేస్ చేస్తూ..వస్తోన్న యంగ్ స్టార్.. ఒక రకంగాసినిమాలు మానేశాడేమో అనుకున్నారంతా.అయితే కాస్త విరామం తీసుకుని ఫ్రెష్ గా వచ్చేస్తున్నాడు కుర్ర హీరో. ఇక చివరిగా గల్లీ రౌడీ సినిమా చేసిన సందీప్ కిషన్ నుంచి ఆ తరువాత మరో సినిమా లేదు.ఇదిలావుంటే ఈ నేపథ్యంలో ఆయన 'మైఖేల్' సినిమా చేశాడు.ఇక రంజిత్ జయకోడి డైరెక్ట్ చేసిన ఈసినిమాను రామ్మోహన్ రావు నిర్మించారు.కాగా ఈ సినిమాలో సందీప్ కు జోడీగా దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ గా నటించింది.
అయితే ఎప్పుడో స్టార్ట్ అయిన ఈసినిమా కాస్త లేట్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతోంది.రీసెంట్ గా ఈమూవీ నుంచి టీజర్ ను రిలీజ్ చేవారు టీమ్. ఈసినిమా కోసం పెద్ద సాహసమే చేశాడు సందీప్ కిషన్.ఇక మైఖేల్ గా కనిపించడం కోసం దాదాపు 24 కేజీలు వెయిట్ తగ్గాడు.అయితే అంత వెయిట్ తగ్గడం అంటే అది సాధారణ విషయం కాదు. కాగా ఈ విషయాల గురించి టీజర్ లాంచ్ లో మాట్లాడాడు సందీప్.ఇకపోతే ఈ టీజర్ లాంచ్ ఈవెంటులో సందీప్ కిషన్ మాట్లాడుతూ .. లైఫ్ లో మనకి ఏది కరెక్టు .. ఏది రాంగ్ అని చాలామంది చెబుతుంటారు. మన కెపాసిటి ఎంత అనే విషయంలో మనకి ఒక క్లారిటీ ఉండాలి. మనల్ని మనం ఏ స్థాయిలో చూసుకోవచ్చు ..
ఎక్కడి వరకూ వెళ్లొచ్చు అనే విషయంలో ఒక అంచనా ఉండాలి. నాకు నేను పెట్టుకున్న టెస్టునే మైఖేల్ అని అన్నాడు. ఇక ఈ సినిమా కోసం ఎంత కష్టమైనా పడాలని డిసైడ్ అయ్యాను.అంతేకాదు పాత్రకి తగినట్టుగా కనిపించడం కోసం 24 కేజీలు బరువు తగ్గాను అని అన్నారు సందీప్. ఈ మూవీ డైరెక్టర్ రంజిత్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పాడు సందీప్ కిషన్.అంతేకాదు ఒక రిస్కీ షాట్ ను ఎలా చేయాలో నాకు చూపించడం కోసం నేను లొకేషన్ కి వెళ్లేలోగా రెండుసార్లు చేసేసి రికార్డు చేసిన దర్శకుడు రంజిత్ జయకోడి. ఇక అలాంటి దర్శకుడు దొరకడం నా అదృష్టం. అయితే ఈ సినిమా రిలీజ్ అయ్యేలోగా ఆయనకు మరో మూడు సినిమాల ఆఫర్లు వచ్చాయి.ఇకపోతే నన్ను అత్యంత సంతోషపెట్టే వియం అది అన్నారు సందీప్. ఈమూవీలో విజయ్ సేతుపతి లాంటి ఆర్టిస్ట్ తో కలిసి నటించడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు సందీప్ కిషన్.అంతేకాదు త్వరలో ఈ మూవీ రిలీజ్ కు ముస్తాబు అవుతుంది. ఇక ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ కొట్టాలని చూస్తున్నాడు సందీప్. కాగా ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ తో కనిపించబోతున్నాడు యంగ్ స్టార్..!!