జపాన్ లో ఎన్టీఆర్.. ఏంటి విషయం?
రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ఆర్ఆ ర్ఆర్ సినిమా జపాన్ లో మరో 2 రోజుల్లో రిలీజ్ కాబో తోంది. ఈ సినిమా ప్రచారం కోసం రాజ మౌళితో కలిసి టోక్యో వెళ్లాడు ఎన్టీఆర్. నిజా నికి రామ్ చరణ్ కూడా వెళ్లాల్సి ఉన్నప్పటికీ.. శంకర్ సిని మాను మధ్యలో వదిలి వెళ్లలేని పరిస్థితిలో ఉన్నాడు చరణ్. ఎఁదుకంటే, తను సినిమా ఆల స్యం చేస్తే, శంకర్ మరింత ఆలస్యం చేస్తాడనేది చరణ్ భయం. అయిన ప్పటికీ ఈ వారం రోజుల్లో ఏదో ఒక రోజు టోక్యోలో ప్రెస్ మీట్ కు హాజ రుకావాలనేది చరణ్ ఆలోచన.మొత్తమ్మీద జపాన్ పై కూడా ఆర్ఆర్ఆర్ త్రయం కన్నేసిందన్నమాట. రాజమౌళి గతంలో తీసిన బాహుబలి-2 సినిమాకు జపాన్ లో డీసెంట్ కలెక్షన్లు వచ్చాయి. పైగా ఆస్కార్ రేసులో ఆర్ఆ ర్ఆర్ అనే ప్రచారంతో, జపాన్ మీడి యా కూడా రాజమౌళిపై, ఆర్ఆర్ఆర్ పై దృష్టి పెట్టింది. సరిగ్గా ఇదే టైమ్ లో సినిమా కూడా రిలీజ్ అవ్వడంతో ప్రచారాన్ని గట్టిగా చేయాలని రాజమౌళి డిసైడ్ అయ్యాడు.
పైగా చైనా- జపాన్ లాంటి మార్కె ట్లలో పట్టు పెంచుకుంటే టాలీవుడ్ కు, మరీ ము ఖ్యంగా రాజమౌ ళి లాంటి భారీ బడ్జెట్ చిత్రాల దర్శకులకు ఎంతో ఉపయో గం ఉంటుంది. అందుకే భవిష్యత్ అవస రాల్ని దృష్టిలో పెట్టు కొని టో క్యోలో ప్రచారానికి వెళ్తున్నా రుఆ ర్ఆ ర్ఆ ర్ సభ్యులు...