కోలీవుడ్ లో స్టార్ హీరో లలో ఒకరైన కార్తీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు .అయితే తెలుగు ప్రేక్షకులకు కూడా కార్తీ బాగా సుపరిచితమే. ఇక ఈయన నటించిన ఎన్నో చిత్రాలు తెలుగులో డబ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంటూ ఉంటాయి.ఇక అలా తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించారు.ఇదిలావుంటే ఆమధ్య కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనగ రాజ్ చేసిన సాలిడ్ థ్రిల్లర్ చిత్రం ఖైదీ సినిమాతో కార్తీ మరింత పాపులర్ అయ్యారు.ఇక ఈ చిత్రం సీక్వెల్ కోసం అటు తెలుగు అభిమానులు, తమిళ ఆడియన్స్ కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ చిత్రం విడుదలైన ప్రతి చోట కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.ఇక ఈ సినిమా లాస్ట్ లో సినిమా సీక్వెల్ కూడా ఉంటుందని రివిల్ చేయగా అక్కడి నుంచి ఈ సినిమా రెండో పార్ట్ మొదలవుతుందని అభిమానులు కూడా భావించారు.అజ్తే కానీ డైరెక్టర్ లోకేష్ మాత్రం ఒకటి తరువాత మరొకటి యూనివర్స్ గా ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు తాజాగా కార్తీ సర్దార్ సినిమాలో నటించారు ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఖైదీ సినిమా సీక్వెల్ పైన అదిరిపోయే అప్డేట్ ప్రకటించడం జరిగింది.కాగా ఈ సినిమా సీక్వెల్ కోసం నేను కూడా చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్న.
అయితే ఆల్రెడీ లోకేష్ కథను కూడా పూర్తి చేశారు. అయితే ఇక ఈ చిత్రం వచ్చే ఏడాది 2023లో చివరి నుంచి మొదలవుతుందని చెప్పారు. ఇకపోతే ఇంత గ్యాప్లో లోకేష్ మరొక హీరోతో సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఇక అది కూడా హీరో విజయ్ దళపతితో అన్నట్లుగా తెలుస్తోంది.అయితే ఎట్టకేలకు ఖైదీ-2 సినిమాని మొదలు పెట్టబోతున్నామని కన్ఫర్మ్ చేశారు కోలీవుడ్ లో స్టార్ హీరో లలో ఒకరైన కార్తీ . దీంతో అభిమానులు కాస్త ఖుషి అయ్యారు..!!