"కాంతారా" దర్శకుడితో అల్లు అరవింద్ మూవీ..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నిర్మాతగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న అల్లు అరవింద్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లు అరవింద్ తన గీత ఆర్ట్స్ సంస్థ ద్వారా ఇప్పటికే ఎన్నో సినిమాలను నిర్మించాడు. ఇది ఇలా ఉంటే అల్లు అరవింద్ సినిమాలను నిర్మించడం మాత్రమే కాకుండా ఇప్పటికే ఎన్నో మూవీ లకు డిస్ట్రిబ్యూటర్ గా కూడా వ్యవహరించి ఎన్నో మూవీ లను విడుదల చేశాడు. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే అల్లు అరవింద్  "గీత ఆర్ట్స్" బ్యానర్ పై ధనుష్ హీరోగా తెరకెక్కిన నేనే వస్తున్నా అనే తమిళ్ మూవీ ని తెలుగు లో విడుదల చేశాడు.


భారీ అంచనాల నడుమ తెలుగు లో విడుదల అయిన నేనే వస్తున్నా మూవీ తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇది ఇలా ఉంటే కన్నడ లో సెప్టెంబర్ 30 వ తేదీన విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయం సాధించిన కాంతారా మూవీ ని అక్టోబర్ 15 వ తేదీన అల్లు అరవింద్ తన గీత ఆర్ట్స్ బ్యానర్ పై తెలుగు లో విడుదల చేశాడు. ఈ మూవీ తెలుగు లో కూడా అద్భుతమైన టాక్ ను తెచ్చుకొని ప్రస్తుతం బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను చేస్తుంది. ఇది ఇలా ఉంటే కాంతారా మూవీ లో రిషబ్ శెట్టి హీరో గా నటించాడు.


అలాగే ఈ మూవీ కి రిషబ్ శెట్టి దర్శకత్వం కూడా వహించాడు. ఇది ఇలా ఉంటే రిషబ్ శెట్టి హీరోగా మరియు రిషబ్ శెట్టి దర్శకత్వంలో అల్లు అరవింద్ ఒక మూవీ ని నిర్మించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లో రాబోతున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: