నటి మీరాజాస్మిన్ కు రవితేజ కు మధ్యా విభేదాలు నిజమేనా..!!

murali krishna
సినీ ఇండస్ట్రీ అంటేనే ఓ రంగుల ప్రపంచం మరి . అందులో తెర మీద ఉన్నంత నవ్వులు తెరవెనక ఉండవు మరీ . కొంతమంది హీరోలు హీరోయిన్లు చేసే పనుల వల్ల అప్పుడప్పుడు గొడవలు, అపార్ధాలు  కూడా జరుగుతూ ఉంటాయి చిత్ర పరిశ్రమలో.
హీరోయిన్లు లేదా హీరోలు షూటింగ్లో సహకరించకపోవడంతో ఇగో అనే సమస్యలు ఎక్కువైపోతాయి. ఇక ఎంసీఏ సినిమా షూటింగ్ టైంలో కూడా సాయి పల్లవి,నాని మధ్య వచ్చిన వచ్చిన ఈగోల వల్ల పెద్ద గొడవ జరిగింది. చివరికి డైరెక్టర్ ప్రొడ్యూసర్ వారి మధ్యలో జోక్యం చేసుకొని ఆ సమస్యను సద్దుమణిగించారు. ఇక ఇలాంటి ఓ వార్త ఇప్పుడు మనం చూద్దాం.
స్టార్ హీరో అయినా రవితేజకు అప్పట్లో ఆయన సరసన నటించిన ఓ హీరోయిన్ మధ్య ఒక చిన్నపాటి గొడవ జరిగిందనే విషయం మనకు తెలిసిన సంగతి విషయమె. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వచ్చిన భద్ర సినిమా లో హీరోగా రవితేజ నటించారు. ఇక ఇందులో రవితేజ సరసన మీరాజాస్మిన్ నటించింది. ఇక ఈ సినిమా షూటింగ్ జరిగేటప్పుడు మీరాజాస్మిన్ హీరో రవితేజతో ఈగోకి పోయింది అనే వార్త అప్పట్లో బాగా వైరల్ అయింది. అందుకే కొన్ని రోజుల పాటు భద్ర సినిమా షూటింగ్ ఆగిపోయిందట. ఇక డైరెక్టర్ బోయపాటి కూడా ఇదేంటి నా మొదటి సినిమాకి ఇలా జరుగుతుందని కొంచెం అయోమయంలో పడ్డారట. అయితే ఈ గొడవను దర్శక నిర్మాతలతో పాటు కొందరు సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా జోక్యం చేసుకుని సెటిల్ చేశారు అంటా మరి .
అయితే ఈ సినిమాలో నటించే టైంలో మీరాజాస్మిన్ బాలకృష్ణ హీరోగా వచ్చిన మహారథి సినిమాలో కూడా నటించిన  సంగతి మనకు తెలిసిందే . ఇక మీరా జాస్మిన్ వల్లే రవితేజకు బాలకృష్ణకు మధ్య గొడవలు వచ్చాయనే వార్త అప్పట్లో ఇండస్ట్రీ వర్గాల్లో  బాగా వినిపించింది. అయితే నిజానికి రవితేజతో మీరాజాస్మిన్ కి ఒక చిన్న గొడవ జరిగింది. కానీ అదే టైంలో మీరాజాస్మిన్ బాలకృష్ణతో కలిసి నటించడం వల్ల బాలకృష్ణకు రవితేజ కు మధ్య గొడవ జరుగుతుందనే ప్రచారం బయటికి వచ్చింది. కానీ ఇది సరైన విషయం కాదు. గొడవ జరిగింది మాత్రం మీరా జాస్మిన్ కు రవితేజకు. ఇక అప్పట్లో ఈ విషయం తెలియని చాలా మంది బాలకృష్ణ కు రవితేజ కు మధ్య గొడవ జరుగుతుందని బాగా ప్రచారం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: