
ఆ సీన్స్ కోసం చాలా టేకులు తీసుకున్న ఎన్టీఆర్..!!
అయితే తారక్ కి కోపం కూడా ఎక్కువ.. ప్రేమ ఎక్కువే . ఏది ఉన్నా సరే వెంటనే ఫేస్ ని చూపిస్తాడు. అందుకే చాలా మంది తారక్ తో నటించడానికి భయపడిపోతారట.. సాధారణంగా తారక్ ఏ సినిమా విషయంలోనూ అజాగ్రత్తగా ఉండడు. పర్ఫెక్ట్ ప్లానింగ్ తో.. టైమింగ్ తో.. డెడికేషన్ తో షూటింగ్స్ స్పాట్ లో ఉంటాడు.
అంతేకాదు ఏ సినిమాకి కూడా ఎక్కువ టేకులు అయితే తీసుకోలేదు . అయితే తన కెరియర్ లోనే ఫస్ట్ టైం జూనియర్ ఎన్టీఆర్ అత్యధికంగా 22 టేకుల తీసుకుని ఓ సీన్ షూట్ చేశారట . అది కూడా రెండు నిమిషాల సీన్ కోసమే.. దీంతో ఒక్కసారిగా నందమూరి ఫ్యాన్స్ షాక్ అయిపోయారట.అంత కష్టపడాల్సిన అవసరం ఏంటి ..ఎన్టీఆర్ ని అంత ఇబ్బంది పెట్టిన సీన్ ఏంటబ్బా.. అనుకుంటున్నారా..?
ఎన్టీఆర్ ని ఆ సీన్ ఇబ్బంది పెట్టలేదు.. సీన్లో నటించినా నటుడు ఎన్టీఆర్ ను తెగ ఇబ్బంది పెట్టాడు. ఆయన మరెవరో కాదు టాలీవుడ్ హాస్య నటుడు బ్రహ్మానందం. అఫ్ కోర్స్ ఈయన పేరు చెప్తేనే జనాలకు నవ్వొచ్చేస్తుంది. ఇక తెరపై చూస్తే కడుపు నొప్పి వచ్చే విధంగా నవ్వాల్సిందే.. అలా ఉంటుంది బ్రహ్మీతో కామెడీ అంటే. బ్రహ్మానందం తారక్ కాంబోలో చాలా సినిమాలు వచ్చాయి ..కానీ అన్ని సినిమాల్లోకి ప్రత్యేక బృందావనం. ఈ సినిమాల్లో వీళ్ళ మధ్య వచ్చే సీన్స్ ఇప్పుడు చూసిన జనాలు కూడా నవ్వు ఆపుకోకుండా ఉండలేరు.
అయితే ఈ సినిమాలో బ్రహ్మానందం తారక్ మధ్య వచ్చే ఓ సీన్ కోసం చాలా టేకులు అయితే తీసుకున్నారట . మీరు సినిమా చూసినట్లయితే బ్రహ్మానందం రూమ్ లోకి తీసుకెళ్లి ఫుల్ వాయించేస్తాడు తారక్. ఆ సీన్ కోసం తారక్ చాలా కష్టపడ్డారట ..ఎందుకంటే బ్రహ్మానందం పెట్టే ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ చూసి డైరెక్టర్ యాక్షన్ అని చెప్పిన ప్రతిసారి ఇలాంటి నవ్వేసేవాడట. ఈ క్రమంలోనే దాదాపు 22 టేకులు తీసుకున్నాడట . ఫైనల్లీ ఇక 23వ టేకు కి డైరెక్టర్ ఆ షాట్ ను ఓకే చేశాడట . ఇప్పటికీ ఈ సినిమాలో ఆ సీన్ వస్తే తారక్ నవ్వకుండా ఉండలేడట . ఈ సీను గుర్తు చేసుకుంటాడట . ఏది ఏమైనా సరే బ్రహ్మానందం-తారక్ కాంబోలో మరో సినిమా వస్తే బాగుండు అంటున్నారట నందమూరి ఫ్యాన్స్. మరి చూడాలి ఆ సినిమా ఎప్పుడు వస్తుందో..?