నట సింహం నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే కొత్త సినిమాలో కీలక పాత్రలకు హిందీలో పేరున్న నటీనటులను తీసుకోవాలని దర్శకుడు అనిల్ రావిపూడి ఆలోచిస్తున్నారట.ఇకపోతే ఇప్పుడు సినిమాలకు, హీరో హీరోయిన్లకు, ఆర్టిస్టులకు బౌండరీలు లేవు. ఇక టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, శాండిల్ వుడ్ వంటి గీతలు అసలే లేవు. ఓ భాషలో సినిమా హిట్ అయితే చాలు... మరో భాషలో డబ్బింగ్ అవుతోంది. అంతేకాదు హిందీ స్టార్స్ తెలుగు సినిమాల్లో నటిస్తున్నారు.ఇక మన తెలుగు స్టార్స్ సినిమాలు హిందీలో విడుదల అవుతున్నాయి.
ఇక ఇది పక్కన పెడితే... కొన్ని క్యారెక్టర్స్ డిమాండ్ చేయడంతో హిందీ ఆర్టిస్టుల వైపు అనిల్ రావిపూడి చూస్తున్నారని సమాచారం.ఇదిలావుంటే ఇక స్పీడుగా సినిమాలు చేయడం బాలకృష్ణ స్టైల్. అంతేకాదు చకచకా షూటింగులు పూర్తి చేస్తారు. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమా చేస్తున్న ఆయన... నవంబర్ నుంచి అనిల్ రావిపూడికి డేట్స్ ఇచ్చారు.ఇక ఆలోపు హీరోయిన్ సెలక్షన్ కంప్లీట్ కావాలి. అయితే బాలకృష్ణ కు 108వ చిత్రమిది. NBK 108 గా పిలుస్తున్నారు.అయితే ప్రస్తుతానికి అదే వర్కింగ్ టైటిల్. షైన్ స్క్రీన్స్ పతాకంపై హరీష్ పెద్ది,
సాహూ గారపాటి NBK108 ను నిర్మిస్తున్నారు.కాగా తండ్రీ కుమార్తెల ఈ సినిమా రూపొందుతోందని ఫిల్మ్ నగర్ టాక్. బాలకృష్ణకు ఈ సినిమా కొత్తగా ఉంటుందని, ఆయనకు డిఫరెంట్ ఇమేజ్ తీసుకు వస్తుందని టాక్.ఇక ఈ సినిమాలో కుమార్తె పాత్రకు 'పెళ్లి సందడి' ఫేమ్ శ్రీ లీల ఎంపిక అయ్యారు. అయితే మరో హీరోయిన్ అంజలి కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఇక ఆమెది విలన్ రోల్ అని టాక్.ఇదిలావుంటే ఇక 'అన్స్టాపబుల్' డిస్కషన్!ఇటీవల సినిమా వార్తలతో కంటే టాక్ షో 'అన్స్టాపబుల్ 2' కారణంగా బాలకృష్ణ వార్తల్లో నిలిచారు. ఇక చంద్రబాబు నాయుడు, లోకేష్ వచ్చిన ఫస్ట్ ఎపిసోడ్ అటు రాజకీయ, ఇటు సినిమా వర్గాల్లో చర్చకు కారణం అయ్యింది. అంతేకాదు ఎక్కడ చూసినా ఆ ఎపిసోడ్లో మాట్లాడిన అంశాల గురించే డిస్కషన్..!!