'జిన్నా' విడుదలకు ముందు ఎందుకిలా జరుగుతుంది...?
తాను ఊహించినట్టుగా 'జిన్నా' విడుదలకు ముందు నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేయడం స్టార్ట్ చేశారని విష్ణు మంచు . సోషల్ మీడియా ద్వారా గల కారణం ఏంటి? అనే వివరాల్లోకి వెళితే...
'ఆదిపురుష్' టీజర్‌పై విష్ణు కామెంట్ చేశారా?
ప్రభాస్ కథానాయకుడిగా నటించిన 'ఆదిపురుష్' టీజర్ కొన్ని రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యూట్యూబ్‌లో టీజర్ విడుదల అయిన తర్వాత ఆడియన్స్ ఇబ్బంది చేశారు. ఆ సంగతి పక్కన పెడితే... విష్ణు మంచు ఆ టీజర్ మీద కామెంట్స్ చేసినట్లు కొందరు మీమ్ మేకర్స్ పోస్టులు చేస్తున్నారు.
''ప్రభాస్, 'ఆదిపురుష్' దర్శక నిర్మాతలుచీట్ చేశారు. 'ఆదిపురుష్' టీజర్‌లో విజువల్స్ కార్టూన్స్‌లా ఉన్నాయి. ఇటువంటి సినిమా తీసే ముందు ప్రేక్షకులను ప్రిపేర్ చేయాలి. అలా కాకుండా చీటింగ్ చేస్తే ఇటువంటి రియాక్షన్స్ వస్తాయి'' అని విష్ణు మంచి వ్యాఖ్యానించినట్టు పోస్టులు చేశారు. అటువంటి పోస్ట్ ఒకటి చేసిన ఆయన... అది ఫేక్ న్యూస్ అని స్పష్టం చేశారు.
''ఫేక్ న్యూస్ ఇది. నేను ఊహించినట్టుగా... ఓ ఐటమ్ రాజా 'జిన్నా' విడుదలకు ముందు నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నాడు. నా డార్లింగ్ బ్రదర్ ప్రభాస్ కు అంతా బెస్ట్ ఉండాలని నేను కోరుకుంటాను'' అని విష్ణు మంచు చెప్పారు .
'జిన్నా' విడుదలకు ముందు ఎందుకిలా?
'జిన్నా' విడుదలకు ముందు ఇతర హీరోలపై విష్ణు మంచు ఈ విధంగా కామెంట్స్ చేశారని తెలిస్తే... ఆ ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. సోషల్ మీడియాలో విష్ణు సినిమాపై నెగిటివ్ పబ్లిసిటీ చేస్తారు. 'జిన్నా' విడుదలకు ముందు కావాలని తన సినిమాకు వ్యతిరేకంగా కుట్ర జరుగుతోందనే అభిప్రాయం విష్ణు వ్యక్తం అయ్యింది. 'ఆదిపురుష్' టీజర్ మీద తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదనే విషయాన్ని ప్రభాస్ అభిమానులకు ఈ సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు.
మా' ఎన్నికలకు ముందు నుంచి... ఇటీవల సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్, మీమ్ మేకర్స్‌తో సమావేశం అయిన విష్ణు మంచు తనపై వస్తున్న న్యూస్ , మీమ్స్ గురించి స్పందించారు. ''జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీ ఉంది. అందులో 21 మంది ఉద్యోగులు ఉన్నారు. వారు కేవలం నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ... ట్రోల్స్ చేస్తున్నారు. మమ్మల్ని హెరాస్ చేస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులను మేం ట్రోల్స్, సోషల్ మీడియా నెగిటివ్ పోస్టుల గురించి సంప్రదించినప్పుడు ఐపీ అడ్రస్ వివరాలు ఇచ్చారు. వాటిలో జూబ్లీ హిల్స్‌లోని సాఫ్ట్‌వేర్ కంపెనీ ఆఫీస్ ఐపీ అడ్రస్... అలాగే జూబ్లీ హిల్స్‌లో ఓ ప్రముఖ నటుడి ఆఫీస్ ఐపీ అడ్రస్ ఉన్నాయి. మాపై వచ్చిన 85 శాతం ట్రోల్స్ ఆ ఆఫీసుల నుంచే వచ్చాయి. మాపై నెగిటివ్ కామెంట్స్ చేసిన ప్రతి ఒక్కరికీ డబ్బులు ఇచ్చారు. 'మా' ఎన్నికల నుంచి ఈ ట్రోల్స్ ఎక్కువ అయ్యాయి'' అని విష్ణు మంచు పేర్కొన్నారు. తాను డబ్బులు ఇవ్వకుండానే తమపై ట్రోల్స్ చేయించిన వారిపై ఇటీవల న్యూస్ వచ్చిందని ఆయన ఆ సందర్భంలో తెలిపారు.