పర్పుల్ కలర్ డ్రెస్ లో మెరిసిపోతున్న పూర్ణ..!

Pulgam Srinivas
అందాల ముద్దు గుమ్మ పూర్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో సినిమాల ద్వారా ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్న ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే ఈటీవీ లో ప్రసారం అవుతున్న డాన్స్ ప్రోగ్రాం డీ కు జడ్జి గా కూడా వ్యవహరిస్తోంది. డి డాన్స్ ప్రోగ్రాం ద్వారా పూర్ణ ఎంతో మంది బుల్లి తెర అభిమానుల మనసు కూడా దోచుకుంది. ఇలా మూవీ లతో ,  టీవీ షో లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతూ వస్తున్న పూర్ణ సోషల్ మీడియాలో కూడా అదిరి పోయే రేంజ్ లో యాక్టివ్ గా ఉంటూ వస్తుంది.
 

అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. ఇది ఇలా ఉంటే అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే పూర్ణ బ్లాక్ కలర్ లో ఉన్న పొట్టి డ్రెస్ ను వేసుకొని ,  హై హీల్స్ ని వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో అదిరిపోయే రేంజ్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది.
 

ఈ ఫోటోలు చాలా రోజుల పాటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.  ఇది ఇలా ఉంటే తాజాగా కూడా పూర్ణ తనకు సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్స్టా లో పోస్ట్ చేసింది. తాజాగా పూర్ణ తన ఇన్స్టా  లో పోస్ట్ చేసిన ఫోటోలలో పర్పుల్ కలర్ లో ఉన్న ప్యాంట్ ను ధరించి ,  అందుకు తగిన పర్పుల్ కలర్ లో ఉన్న కోట్ ను వేసుకొని ,  అదిరి పోయే యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం పూర్ణ కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: