ఆ రెండు మూవీలు కూడా సంక్రాంతి లిస్ట్ లో జాయిన్ కానున్నాయా..?

Pulgam Srinivas
సంక్రాంతి పండుగ వచ్చింది అంటే టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర అనేక మూవీ లు విడుదల అవుతూ ఉంటాయి. ఎక్కువ శాతం సంక్రాంతి బాక్సా ఫీస్ పోరులో స్టార్ హీరోల సినిమాలు నిలబడుతూ ఉంటాయి. అలాగే వచ్చే సంవత్సరం సంక్రాంతి కి కూడా స్టార్ హీరోల సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర తలపడబోతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే కొన్ని సినిమాల విడుదల తేదీలను కూడా మూవీ యూనిట్ లు ప్రకటించాయి. ఇది ఇలా ఉంటే మరి కొన్ని సినిమాలు ఈ పోటీలో పాల్గొనడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా సంక్రాంతి కి మరో రెండు సినిమాలను విడుదల చేయడానికి మూవీ మేకర్స్ చాలా ఉత్సాహాన్ని చూపిస్తున్నట్లు తెలుస్తుంది.


ఆ సినిమాల వివరాలను తెలుసుకుందాం. నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ చిత్రీకరణ ప్రస్తుతం చివరి దశకు చేరినట్లు తెలుస్తుంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని మూవీ యూనిట్ ప్రణాళికలను రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఎలా ఉంటే ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ,  వరలక్ష్మీ శరత్ కుమార్ , దునియా విజయ్ ఈ మూవీ లో కీలక పాత్రలో నటించారు.


అక్కినేని అఖిల్ ప్రస్తుతం టాలీవుడ్ స్టైలిష్ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తేరకెక్కుతున్న ఏజెంట్ మూవీ లో హీరో గా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ,  ఈ మూవీ కి హిప్ హప్ తమిజా సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ చిత్రీకరణ కూడా చివరి దశకు చేరినట్లు తెలుస్తుంది. ఈ మూవీ ని కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని ఆలోచనలో మూవీ మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: