టాలీవుడ్ యువ హీరోలలో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో ముందుకి దూసుకుపోతున్న హీరో అక్కినేని నాగ చైతన్య..ఈమధ్య కాలం లో ఆయన నుండి విడుదలైన 'థాంక్యూ' అనే చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచినప్పటికీ కూడా నాగ చైతన్య పై ఏ మాత్రం ప్రభావం చూపలేదు..డిజాస్టర్ ఫ్లాప్ పడింది అని కృంగిపోకుండా రెట్టింపు ఉత్సాహం తో తన తదుపరి చిత్రాన్ని ప్రారంబించాడు.తమిళ టాప్ డైరెక్టర్ విక్రమ్ ప్రభు తో ఆయన చేస్తున్న సినిమా షూటింగ్ శెరవేగంగా సాగుతుంది..విక్రమ్ ప్రభు సినిమాలు అంటే టాలీవుడ్ కూడా మంచి క్రేజ్ ఉంది..ఆయన తమిళ టాప్ హీరో శింబు తో తెరకెక్కించిన మనాడు చిత్రం కొద్దీ నెలల క్రితమే విడుదలై కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది..అంత మంచి ఫామ్ లో ఉన్న డైరెక్టర్ తో నాగ చైతన్య సినిమా చేస్తుండడం తో ఈ మూవీ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొంది.అయితే ఈ సినిమా షూటింగ్ లో చోటు చేసుకున్న ఒక ఘటన ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది..అసలు విషయానికి ఈ చిత్రం షూటింగ్ కర్ణాటకలోని మాండ్య జిల్లాలోని మేల్కొటి గ్రామం లో ప్రత్యేకమైన అనుమతి ని తీసుకొని ఆ చిత్ర బృందం షూటింగ్ చేస్తుంది..సినిమాలో కీలకమైన ఒక సన్నివేశం కోసం ఒక వైన్ షాప్ సెట్ ని వేశారు..ఆ వైన్ షాప్ సెట్ ప్రాంగణం లోనే ఆ రాయగోపారా దేవాలయం ఉన్నది..దీనితో అక్కడి స్థానిక ప్రజలు షూటింగ్ జరుగుతున్న సెట్స్ లోకి వచ్చి పెద్ద గొడవ చేసారు..పవిత్రమైన ఆలయం ఉన్న చోట హిందూ ధర్మాన్ని అవహేళన చేసే విధంగా ఇలా వైన్ షాప్ సెట్ వేస్తారా..వెంటనే ఖాళి చెయ్యండి అంటూ గొడవకి దిగారు.అయితే ఇక్కడి అధికారులు మాకు ప్రత్యేకమైన అనుమతిని ఇచ్చారంటూ ఆ గ్రామప్రజలు మూవీ టీం వివరిస్తున్నప్పటికీ వాళ్ళు అసలు తగ్గలేదు..మూవీ టీం కూడా మాకు అనుమతి ఉంది..ఇప్పుడు షూటింగ్ ఆపితే కోట్ల నష్టం వస్తుంది మేము ఆపము అంటూ మొండికేశారట..అప్పుడు గ్రామ ప్రజలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చెయ్యగా వాళ్ళు వెంటనే అక్కడికి వచ్చి, అనుమతిని రద్దు చేసి షూటింగ్ ఆపేయాలి అంటూ ఆదేశించారట..ఇక చేసేది ఏమి లేక షూటింగ్ ఆపుకొని అక్కడి నుండి మూవీ టీం వెనుతిరిగినట్టు సమాచారం..ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.