మహేష్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సాయి పల్లవి...!!
అందుకే ఆమె అందాన్ని కాకుండా వ్యక్తిత్వాన్ని, టాలెంట్ ని ఆరాధించే అభిమానులు ఎందరో ఉన్నారు.ఈ మధ్య సాయి పల్లవి సినిమాలు తగ్గించడంతో అభిమానులు కూడా కొంత నిరాశకు గురి అవుతున్నారు. డిమాండ్ ఉండి కూడా కొత్త చిత్రాలకు సైన్ చేయడం లేదు. ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో అధికారికంగా ఒక్క తెలుగు చిత్రం లేదు. కాగా సాయి పల్లవి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారట . ఆమె పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
ఆమె సినిమాల ఎంపిక గురించి మాట్లాడుతూ.. ఫలానా హీరోతో చేయాలనే కోరిక అయితే నాకు లేదు. కథ నచ్చితే ఎవరితో అయినా చేస్తాను.మీ మీకు ఒక స్టార్ హీరో సినిమాలో ఆఫర్ వచ్చిందని చెబితే ఆ హీరో ఎవరని కూడా అడగను. కథ చెప్పమంటాను. పరిశ్రమలో ఉన్న హీరోలందరి పై నాకు గౌరవం ఉంది. అల్లు అర్జున్ డాన్స్ ని బాగా ఇష్టపడతాను. ఇక మహేష్ బాబు స్క్రీన్ ప్రెజెన్స్ నచ్చుతుంది. ఆయన్ని చూశాక... మగాళ్లు ఇంత అందంగా ఉంటారా! అనిపించిందని సాయి పల్లవి వెల్లడించారట.
నేను ప్యూర్ వెజిటేరియన్. అన్నం, పప్పు ఉంటే చాలు ఇంకా ఏమీ అడగను. సెట్లో కూడా కొబ్బరి నీళ్లు, మజ్జిగతో సరిపెట్టుకుంటాను. అసలు వ్యాయామం చేయను.అప్పుడప్పుడు అమ్మతో బ్యాడ్మింటన్ ఆడతాను. నేను త్వరగా బరువు పెరగనని సాయి పల్లవి చెప్పుకొచ్చిందట. అలాగే సోషల్ మీడియా అంటే పడదన్న సాయి పల్లవి, అదో టైం వేస్ట్ వ్యవహారం అని కొట్టిపారేసింది.
పరిశ్రమకు వచ్చిన కొత్తలో అనేక అనుమానాలు ఉన్నాయి. నేను అందంగా ఉండను, ముఖంపై మొటిమలు ఉంటాయి. హీరోయిన్స్ అంటే చాలా అందంగా ఉంటారు. నేను పరిశ్రమలో రాణించగలనా అనే అనేక సందేహాలు వెంటాడాయట. ప్రేమమ్ మూవీ సమయంలో కూడా అదే సందేహాలు వెంటాడేవి. అనేకమార్లు దర్శకుడిని మధ్యలో తీసేయరు కదా అని అడిగేదాన్ని. ప్రేమమ్ దర్శకుడు నాలో విశ్వాసం నింపారు, అని సాయి పల్లవి చెప్పుకొచ్చారట..
నటన, డాన్స్ నేర్చుకోలేదు. చిన్నప్పుడు భరతనాట్యం క్లాసులకు పంపారు. ఒకే స్టెప్ వారం రోజులు నేర్పారు. నాకు వచ్చేసింది, కొత్త స్టెప్ నేర్పమన్నాను. ఇదే స్టెప్ నెలరోజులు ప్రాక్టీస్ చేయాలి అన్నారట. దాంతో నాట్యం నేర్చుకోవడం మానేశాను. మాధురి దీక్షిత్ డాన్స్ వీడియోలు చూస్తూ స్టెప్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని. సాయి పల్లవి బాగా నటించదని ఎవరైనా అంటే.. మా అమ్మ నువ్వెక్కడ నటించావే ఇంట్లో ఉన్నట్లే ఉన్నావు అంటుందట.
నా కెరీర్ లో ఫిదా, లవ్ స్టోరీ చిత్రాలు చాలా ప్రత్యేకం. అందుకు దర్శకుడు శేఖర్ కమ్ములకు కృతజ్ఞతలు చెప్పాలి. ముఖ్యంగా ఫిదా మూవీతో నా ప్రయాణం మారిపోయిందని ఆలోచన విధానం కూడా శేఖర్ కమ్ముల మార్చేశారు. హీరో నుండి లైట్ బాయ్ వరకు ఆయన అందరినీ సమానంగా చూస్తారని ఎక్కడైనా నీ హక్కులు కాపాడుకోవడానికి పోరాడు అంటారని సాయి పల్లవి శేఖర్ కమ్ములను పొగిడిందట.