గాడ్ ఫాదర్ సినిమా తర్వాత సత్యదేవ్ పరిస్థితి ఏంటి..!!
తమిళ నటి ప్రియా భవాని శంకర్ కి ఈ చిత్రంలో నటించే అవకాశాన్ని కల్పించారు మేకర్స్. ఈ సినిమా ద్వారా ప్రియ భవాని శంకర్ తెలుగు తెరకు పరిచయం చేయబోతున్నారు బ్లాక్ బస్టర్ చిత్రమైన తీరు తో సహా అనేక తమిళ చిత్రాలలో నటించింది.అయితే ఇప్పటికి మాత్రం తెలుగులో స్ట్రైట్ గా ఏ చిత్రంలో కూడా నటించలేదు. ఈ సినిమాలు ప్రియా ఫ్యాషన్ డిజైనర్ గా కనిపించబోతున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.
చరణ్ రాజ్ ఈ చిత్రానికి మ్యూజిక్ కంపోజ్ చేయగా.. మిరాఖ్ డైలాగ్స్ అందిస్తున్నారు. ఇద్దరు ప్రతిభవంతులైన నటులు సత్యదేవ్ ధనంజయులను ఒకే ఫ్రేమ్లో చూడడం చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని అభిమానులు సైతం భావిస్తూ ఉన్నారు. ఇక ఇటీవలే గాడ్ ఫాదర్ చిత్రంతో చిరంజీవితో కలిసి నటించిన సత్యదేవ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. అయితే సత్యదేవ్ ఈ చిత్రంలో విలన్ గా నటించాడు గాడ్ ఫాదర్ సినిమా తర్వాత సత్యదేవ్ ద్వి భాషా చిత్రానికి ప్లాన్ చేయడం సరైన నిర్ణయమేనా అని అభిమానులు సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ చిత్రంతోనైనా మరింత పేరు సంపాదించుకుంటారేమో చూడాలి మరి.