ఆన్ స్టాపబుల్ సీజన్ 2 : మొదటి ఎపిసోడ్ కు 24 గంటల్లోనే అన్ని వ్యూస్..!

Pulgam Srinivas
నందమూరి నటసింహం బాలకృష్ణ ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో అన్ స్టాపబుల్ టాక్ షో కు పోస్ట్ గా వ్యవహరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఆన్ స్టాపబుల్ టాక్ షో మొదటి సీజన్ విజయవంతంగా పూర్తి అయింది. కెరియర్ లో మొట్ట మొదటి సారి ఒక టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరించి నప్పటికీ బాలకృష్ణ తన వాక్చాతుర్యంతో అన్ స్టాపబుల్ సీజన్ 1 ను అద్భుతమైన విజయం సాధించే లా చేశాడు.  ఇది ఇలా ఉంటే తాజాగా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రారంభం అయింది. అన్ స్టాపబుల్ సీజన్ 2 ను చాలా గ్రాండ్ గా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్రారంభించింది.
 


ఆన్ స్టాపబుల్ సీజన్ 2 కోసం కూడా ఎంతో మంది ప్రేక్షకులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఈ టాక్ షో లో మొదటి ఎపిసోడ్ కు గెస్ట్ లుగా మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్ లు విచ్చేశారు. అన్ స్టాపబుల్ సీజన్ 2 టాక్ షో మొదటి ఎపిసోడ్ నిన్న అనగా అక్టోబర్ 14:వ తేదీన స్ట్రీమింగ్ అయింది. ఇది ఇలా ఉంటే అన్ స్టాపబుల్ సీజన్ 2 లోని ఫస్ట్ ఎపిసోడ్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.


ఆన్ స్టాపబుల్ సీజన్ 2 మొదటి ఎపిసోడ్ ప్రసారం అయిన  24 గంటల్లో ఏకంగా 10 లక్షల ప్లస్ వ్యూస్ ను సాధించినట్లు ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్  తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇలా  ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో  స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 మొదటి ఎపిసోడ్ కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. మరి రాబోయే రోజుల్లో ఈ టాక్ షో ప్రేక్షకుల నుండి ఏ రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: