మరోసారి మణిరత్నం దర్శకత్వంలో రజనీకాంత్..!

Pulgam Srinivas
సూపర్ స్టార్ రజనీ కాంత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రజినీ కాంత్ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరో గా నటించి కోలీవుడ్ ఇండస్ట్రీ లో ఇప్పటికి కూడా టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే రజినీ కాంత్ తాను నటించిన మూవీ ల ద్వారా కేవలం ఇండియాలో మాత్రమే కాకుండా , ఇతర దేశాలకు కూడా ఎంతో మంది అభిమానుల ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీ కాంత్ "జైలర్" అనే మూవీ లో హీరోగా నటిస్తున్నాడు.


ఈ మూవీ కి తమిళ క్రేజీ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తూ ఉండగా , అనిరుద్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ లో రమ్య కృష్ణ ఒక కీలక పాత్రలో కనిపించబోతుంది. అలాగే మిల్కీ బ్యూటీ తమన్నా కూడా ఈ మూవీ లో ఒక ముఖ్య మైన పాత్రలో కనిపించే అవకాశం ఉన్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే జైలర్ మూవీ కి సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను మూవీ యూనిట్ విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది.


సూపర్ స్టార్ రజనీ కాంత్ లైకా ప్రొడక్షన్ హౌస్ లో రెండు మూవీ లకు కమిట్ అయిన విషయం మనకు తెలిసిందే. ఇందులో ఒక మూవీ కి శిబి చక్రవర్తి దర్శకత్వం వహించనుండగా , మరో మూవీ కి మణిరత్నం దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే చాలా సంవత్సరాల క్రితం రజనీ కాంత్ , మణిరత్నం కాంబినేషన్ లో దళపతి అనే మూవీ తెలకెక్కింది. దళపతి మూవీ అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇలా చాలా సంవత్సరాల తర్వాత రజనీ కాంత్ ,  మణిరత్నం కాంబినేషన్ లో మూవీ రాబోతుంది అనే వార్త రావడంతో రజనీ కాంత్ అభిమానులు తీవ్ర సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: