మహేష్ ను ఢీకొట్టే విలన్ కోసం.. జక్కన్న వేట స్టార్ట్?
ఇక ఈ సినిమా కోసం ప్రస్తుతం జక్కన్న తీవ్రస్థాయిలోనే కసరత్తులు చేస్తున్నాడు. మహేష్ బాబు బాడీ లాంగ్వేజ్ కి సరిపడా అదిరిపోయే స్టోరీని సిద్ధం చేసేసాడు అన్నది కూడా తెలుస్తుంది. ఇకపోతే తన సినిమాలో మహేష్‌ను ఢీకొట్టే విలన్ పాత్రలో ఎవరైతే బాగుంటుంది అనే విషయంపై కూడా ఆలోచనలో పడిపోయాడట రాజమౌళి. ఈ క్రమంలోనే ఎంతోమంది ప్రముఖ నటులతో ఇక విలన్ పాత్రల కోసం దర్శక ధీరుడు రాజమౌళి సంప్రదింపులు జరుపుతున్నాడు అన్నది ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న టాక్. అయితే ప్రముఖ రచయిత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పిన దాన్ని బట్టి మహేష్ తో సినిమా అమెజాన్ అడవుల్లో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సినిమా ఉండబోతుంది అన్నది మాత్రం తెలుస్తుంది.
అయితే ఇక ఈ సినిమా గ్రాఫిక్స్ విషయంలో ముందుగానే ఒక ప్లాన్ రెడీ చేసుకుని పెట్టుకున్నారట జక్కన్న. ఇక ఫైనల్ స్క్రిప్ట్ తుది దశలో ఉండగా కీలక పాత్రలోని ఆర్టిస్టులను కూడా ఫైనల్ చేయాలని రాజమౌళి నిర్ణయానికి వచ్చినట్లు టాక్ ఉంది. విలన్ పాత్ర కోసం తమిళ హీరోను సంప్రదించే ఆలోచనలు ఉన్నారట జక్కన్న. అయితే తమిళంలో కాదు తెలుగులో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్న స్టార్ హీరో సూర్య తమ్ముడు కార్తీ ని ఇక విలన్‌గా తమ సినిమాలు నటింపజేయాలని అనుకుంటున్నాడట. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇండస్ట్రీలో మాత్రం ఇందుకు సంబంధించిన వార్త తెగ చెక్కలు కొడుతుంది.