తెలుగు ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీ కి ఎలాంటి పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోలు తమ టాలెంట్ తో స్టార్ హీరోలుగా ఎదిగారు.ఇకపోతే స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్ 'గంగోత్రి' చిత్రంతో హీరోగా ఎంట్రీ తన డ్యాన్స్, ఫైట్స్, కామెడీతో ఐకాన్ స్టార్ కోట్ల మంది అభిమానం సంపాదించుకున్నాడు.ఇదిలావుండగా ఇక సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయిన పుష్ఫ తో తన రేంజ్ మరింతగా పెంచుకున్నాడు.అయితే ఇప్పటికీ కొన్ని చోట్ల పుష్ప మానియా తగ్గనే లేదు.
ఇక ఈ మూవీలో డ్యాన్స్ స్టెప్పులు, డైలాగ్స్ జనాలు ఇంకా ఫాలో అవుతూనే ఉన్నారు.ఇకపోతే అల్లు అర్జున్ నటించిన మొదటి పాన్ ఇండియా మూవీ పుష్ప. అయితే ఈ మూవీకి ప్రపంచ స్థాయిలో విపరీతమైన క్రేజ్ లభించింది.అంతేకాదు ఇందులో తగ్గేదే లే అనే డైలాగ్ తెగ పాపులర్ అయ్యింది. ఇకపోతే పుష్ప మూవీకి ఈ ఏడాది అవార్డుల పంట పండింది.ఇదిలావుంటే ఇటీవల ఈ మూవీకి సైమా, ఫిలిం ఫేర్ అవార్డులు అత్యధికంగా వచ్చాయి. అయితే తాజాగా అల్లు అర్జున్ కి మరో అరుదైన గౌరవం లభించింది.ఇక ప్రతిష్టాత్మక ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు అల్లు అర్జున్ కి దక్కింది.
కాగా ఈ అవార్డు అందుకున్న తొలి సౌత్ ఇండియా హీరో బన్ని కావడం మరో విశేషం.అయితే న్యూ ఢిల్లీలో జరిగిన ఈ వేడుకకు ముఖ్య అతిధిగా కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ హాజరయ్యారు.ఇక స్మృతీ ఇరానీ చేతుల మీదుగా ఇండియన్ ఆఫ్ ది ఇయర్ 2022 అవార్డు అందుకున్నారు అల్లు అర్జున్.అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన కెరీర్ ప్రారంభం అయి ఇరవై ఏళ్లు అవుతుందని.. ఇప్పటి వరకు సౌత్ సినీ పరిశ్రమ నుంచి ఎన్నో అవార్డులు తీసుకున్నానని. కానీ ఇక ఫస్ట్ టైమ్ తాను నార్త్ ఇండియా నుంచి అవార్డు అందుకోవడం ఎంతో సంతోషం అనిపిస్తుందని.. ఇది తనకు ఎంతో ప్రత్యేకం అని అన్నారు.ఇదిలావుంటే ఇప్పుడు సీనీ ఇండస్ట్రీలో పాన్ ఇండియా కల్చర్ నడుస్తుంది.. నార్త్, సౌత్ అనే బేధాలు లేకుండా అందరం సినీ కళామతల్లి బిడ్డలమే అన్నారు.అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇండియన్ సినిమా గొప్పతనం ఎప్పటికీ తగ్గేదే లే అంటూ తన పుష్ప డైలాగ్ చెప్పి అందరినీ ఆకట్టున్నారు బన్నీ..!!