'కాంతారా' హీరో రిషబ్ శెట్టికి ఆ టాలీవుడ్ స్టార్ హీరో అంటే చాలా ఇష్టమట.. ఎందుకో తెలుసా..?

Anilkumar
ఈ మధ్య కాలంలో చాలావరకు  కన్నడ సినిమాలు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. ఇక 'కేజీఎఫ్‌' తర్వాత పలు కన్నడ సినిమాలు పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలై మంచి విజయాలు సాధిస్తున్నాయి.కే జి ఎఫ్ సినిమా ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే ఈ క్రమంలోనే ఇటీవలే కన్నడలో బ్లాక్‌బస్టర్‌ అయిన ‘కాంతార’ మూవీ తెలుగులో విడుదలకు సిద్ధమైంది. ఇకపోతే రిషబ్‌ శెట్టి నటిస్తూ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్‌ 15న ప్రేక్షకులు ముందుకు రానుంది. అయితే ఈ క్రమంలో చిత్రబృందం తెలుగులో భారీగా ప్రమోషన్‌లు జరుపుతున్నారు.


 ఇకపోతే ప్రమోషన్‌లో భాగంగా సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు రిషబ్‌ శెట్టి .అంతేకాదు రిషబ్‌శెట్టి తాజాగా ఓ ఇంటర్వూలో తెలుగు నటుల గురించి చెప్పాడు  రిషబ్‌శెట్టి .అయితే  తను చిన్నప్పటి నుండి తెలుగు సినిమాలు చూస్తున్నానని. ఇక సీనియర్‌ ఎన్టీఆర్‌, సూపర్‌ స్టార్‌ కృష్ణ, బాలకృష్ణ, చిరంజీవి సినిమాలు చూసేవాడినని చెప్పాడు  రిషబ్‌శెట్టి . అంతేకాకుండా ఇక  తనకు తారక్‌ అంటే చాలా ఇష్టమని తెలిపాడు. ఎందుకంటే ఇక  ఎన్టీఆర్‌ వాళ్ల అమ్మ.. తన ఊరేనని చెప్పాడు.కాగా  ఎన్టీఆర్‌ నటన అద్భుతంగా ఉంటుందని వెల్లడించాడు  రిషబ్‌శెట్టి . 


ఇకపోతే  మహేష్‌ బాబు, అల్లుఅర్జున్‌, రామ్‌చరణ్‌ సినిమాలను కూడా చూస్తానని చెప్పాడు  రిషబ్‌శెట్టి .అయితే రిషబ్‌శెట్టి కన్నడ ఇండస్ట్రీలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదిలావుంటే ఓ వైపు సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే మరో వైపు నటుడిగా, ప్రొడ్యూసర్‌గా చేస్తూ సినీరంగంలో దూసుకుపోతున్నాడు  రిషబ్‌శెట్టి . అయితే ఇటీవలే కన్నడలో విడదులైన కాంతార సినిమా దాదాపు రూ.80 కోట్ల వరకు గ్రాస్‌ను కలెక్ట్‌ చేసి సినీ విశ్లేషకులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది.అయితే ఈ సినిమాను తెలుగులో గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నాడు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: