పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా డైలాగ్ వెనుక.. ఇంత కథ ఉందా?

praveen
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకులకు ముందుకు వచ్చిన సినిమా పుష్ప.. స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో  ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పుడు వరకు గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథంలో ఎన్నో సినిమాలు వచ్చిన పుష్ప మాత్రం మేము కాస్త ప్రత్యేకము అన్నట్లుగానే ఓ రేంజ్ లో హిట్ సాధించింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ సాధించడమే కాదు అటు ప్రేక్షకులను ఎంతగానో ప్రభావితం చేసింది.. ఈ సినిమాలోని పాటలు ఈ సినిమాలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగులు ప్రేక్షకుల నోళ్లల్లో ఎప్పుడూ నానుతూనే ఉన్నాయి.


 ముఖ్యంగా అల్లు అర్జున్ చెప్పే తగ్గేదేలే డైలాగ్.. కొన్ని కొన్ని సార్లు పుష్ప అనుకుంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్ అంటూ అల్లు అర్జున్ తన తైన శైలిలో చెప్పే డైలాగ్ అయితే మరింత బ్లాక్ బస్టర్ అయ్యాయి అని చెప్పాలి. అయితే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటూ అనే డైలాగు వెనుక ఉన్న స్టోరీని ఇటీవల అల్లు అర్జున్ సైమా అవార్డు వేదికగా బయటపెట్టాడు. తమ సినిమా టైటిల్ ప్రకటించక ముందే నేను డైరెక్టర్ హరీష్ శంకర్ ను కలిశాను. ఆయనతో మాట్లాడుతున్న సమయంలో టైటిల్ చెప్పగానే హరీష్ శంకర్ పుష్ప అంటే ఫ్లవర్ కదా అని అన్నారు. టైటిల్ అమ్మాయి పేరు లాగా ఉండడమే కాదు సాఫ్ట్ గా ఉందని హరిష్ శంకర్ చెప్పారు..


 ఇక ఆ తర్వాత ఈ విషయాన్ని సుకుమార్ దగ్గర ఎప్పుడు ప్రస్తావించలేదు. ఇక ఒకానొక సమయంలో ఈ విషయం చర్చకు వచ్చింది. పుష్ప అంటే ఫ్లవర్ అని అర్థం వస్తుంది కదా పెద్దగా బాగోదేమో అంటూ సుకుమార్ కి చెప్పాను. వెంటనే సుకుమార్ స్పందిస్తూ పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైర్ అనే డైలాగు రాశారు.  ఇక ప్రతి ఒక్కరిలో ఈ సందేహం వస్తుంది. వారికి ఈ డైలాగ్ సమాధానం చెబుతుంది అంటూ సుకుమార్ చెప్పారు అంటూ అల్లు అర్జున్ సైమ అవార్డ్స్ వేదికగా గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత సినిమాలో ఈ డైలాగ్స్ బాగా ఫేమస్ అయ్యింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: