బాలకృష్ణ అభిమానులను నిరాశపరిచిన ఫిలిం ఫేర్ అవార్డ్స్ !

Seetha Sailaja
గత సంవత్సరం విడుదలైన ‘అఖండ’ మూవీతో బాలకృష్ణ తన స్టామినాను చూపించాడు. బాలయ్య క్రేరియర్ లో 100 కోట్లు కలెక్ట్ చేసిన మూవీగా రికార్డ్ లను క్రియేట్ చేయడంతో బాలయ్య అభిమానుల ఆనందానికి హద్దులు లేవు. ఈమూవీలో అఘోరా గా నటించిన బాలకృష్ణ తన నట విశ్వరూపాన్ని చూపించడంతో బాలకృష్ణ స్టామినా అందరికీ తెలిసిరావడమే కాకుండా సగటు ప్రేక్షకుడు కూడ బాలయ్య నటనకు ఫిదా అయ్యారు.

ఇలాంటి పరిస్థితులలో ఈమూవీకి ఫిలిం ఫేర్ అవార్డ్ వస్తుందని అదేవిధంగా బాలకృష్ణ ఉత్తమ నటుడి అవార్డ్ కు ఎంపిక అవుతాడని బాలయ్య అభిమానులు ఎంతగానో ఆశించారు. అయితే జరిగింది వేరు అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీకి సంబంధించి బన్నీకి ఉత్తమ నటుడు అవార్డ్ వచ్చింది. ఈవిషయమై బాలకృష్ణ అభిమానులు మరొక విధంగా ఫిలిం ఫేర్ అవార్డ్ ప్యానల్ ను ప్రశ్నిస్తున్నారు.

కథ పరంగా ఈ రెండు సినిమాలకు చాల వ్యత్యాసం ఉన్నప్పటికీ ‘అఖండ' లో బాలయ్య అఘోర పాత్ర పోషించి హిందు మతతత్వ గొప్పదనాన్ని చెప్పే ప్రయత్నం చేస్తే బన్నీ ‘పుష్ప’ ద్వారా అడవి సంపదను ఎలా దోపిడి చేయాలో చెప్పాడని అయితే ఫిలిం ఫేర్ అవార్డ్ ప్యానల్ కు మంచి కంటే చేదు బాగా నచ్చిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ఫిలిం ఫేర్ అవార్డ్ ల ఎంపికలో కథలో ఉండి నీతి నీమాలు గురించి పట్టించుకోరు. ఆపాత్రకు సంబంధించి నటుడు ఎంత సహజంగా నటించి మెప్పించాడు అన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారు.


దీనికితోడు ఫిలిం ఫేర్ అవార్డ్ ల ఎంపికలో కూడ అనేకరకాల రికమండేషన్స్ ఉంటాయి అన్నప్రచారం ఎప్పటి నుంచో ఉంది. చిన్నచిన్న నటులకు కూడ యూనివర్సిటీ డాక్టరేట్ లు వస్తున్నప్పటికీ అలాంటి విషయాల పై దృష్టి పెట్టకుండా తన నటన గురించి మాత్రమే ఆలోచించే బాలకృష్ణకు ఎన్నో నంది అవార్డులు వచ్చిన విషయం బాలయ్య అభిమానులు మరిచిపోయి ఉంటారు..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: