
ఆ సినిమా చేయడం కంటే ఖాళీ గా ఇంట్లో కూర్చో అన్నా " మొత్తుకుంటోన్న ప్రభాస్ ఫ్యాన్స్....!!
కానీ అతని స్టామినాను ప్రపంచానికి, బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం చేశాయి. ఇక వచ్చే ఏడాది జనవరిలో ఆదిపురుష్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి ట్రైలర్ ఇప్పటికే విడుదలైన విషయం తెలిసిందే. ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ కూడా వచ్చే ఏడాది విడుదల కానుంది. దీనికి కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక స్పిరిట్, ప్రాజెక్టు కే కూడా వచ్చే ఏడాది విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే, ఈ టైంలో ప్రభాస్ మారుతి దర్శకత్వంలో కామెడీ హార్రర్ జోనర్ ట్రై చేస్తున్నట్టు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మారుతి జోనర్‌పై ఫ్యాన్స్ టెన్షన్..
ఇందులో హీరోయిన్లుగా నిధిఅగర్వాల్, మాళవికమోహన్‌తో పాటు కీలక పాత్రలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ నటిస్తున్నారని టాక్. అదే నిజమైతే మరోసారి ప్రభాస్‌కు డిజాస్టర్ పడుతుందేమోనని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. అసలు మారుతితో డార్లింగ్ ప్రభాస్ ఎందుకు సినిమా కమిట్ అయ్యాడని కూడా కొందరు చర్చించుకుంటున్నారు. గతంలో మారుతి ప్రేమ్ కథా చిత్రమ్ వంటి కామెడీ హార్రర్ మూవీ తీశాడు.అది చిన్న సినిమా, అందులోని స్టార్స్ కూడా చిన్నవాళ్లే కావడంతో పెద్దగా నష్టం లేదు. ఆ సినిమా అదృష్టవశాత్తు హిట్ అయ్యింది. కానీ ప్రభాస్ రేంజ్ ఇప్పుడు హాలీవుడ్ వరకు వెళ్లింది. అలాంటిది ఇప్పుడు ఇలాంటి సినిమాలు చేస్తే తమకు బ్యాడ్ నేమ్ వస్తుందని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.