మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
రామ్ చరణ్ కొంత కాలం క్రితం విడుదల అయిన ఆర్ ఆర్ ఆర్
మూవీ తో అద్భుతమైన క్రేజ్ ను ప్రపంచ వ్యాప్తంగా సంపాదించుకున్నాడు. ఈ
మూవీ కి
రాజమౌళి దర్శకత్వం వహించగా ,
జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ
మూవీ లో హీరోగా నటించాడు. ఆర్ ఆర్ ఆర్
మూవీ తో ప్రపంచ వ్యాప్తంగా తన కంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న మెగా
పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దేశం గర్వించ దగ్గ గొప్ప దర్శకులలో ఒకరు అయినటు వంటి
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ పాన్
ఇండియా మూవీ లో
హీరో గా నటిస్తున్నాడు. ఈ
మూవీ కి
మూవీ యూనిట్ ఇప్పటి వరకు ఈ
మూవీ కి టైటిల్ ని ఫిక్స్ చేయకపోవడంతో , ఈ
మూవీ రామ్ చరణ్ కెరియర్ లో 15 వ
మూవీ గా రూపొందుతూ ఉన్న నేపథ్యంలో , ప్రస్తుతం ఈ
మూవీ షూటింగ్ ఆర్ సి 15 అనే వర్కింగ్ టైటిల్ తో జరుగుతుంది.
ఇప్పటికే ఈ
మూవీ షూటింగ్ చాలా వరకు పూర్తి అయ్యింది. ఈ
మూవీ లో
కియారా అద్వానీ ,
రామ్ చరణ్ సరసన
హీరోయిన్ గా నటిస్తూ ఉండగా , సునీల్ , అంజలి ఈ
మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఎస్ జే
సూర్య ఈ
మూవీ లో విలన్ గా కనిపించనుండగా , తమన్ ఈ
మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ
మూవీ ని ప్రముఖ
నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
మూవీ విడుదలకు సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
రామ్ చరణ్ హీరోగా
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న
మూవీ ని 2024 వ సంవత్సరం
సంక్రాంతి కానుకగా విడుదల చేసే ఆలోచనలో
మూవీ యూనిట్ ఉన్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే అద్భుతమైన క్రేజ్ ఉన్న
రామ్ చరణ్ మరియు
శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న
మూవీ కావడంతో ఈ
మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.