మెగా హీరోల మౌనానికి అర్థాలు వెతుకుతున్న బన్నీ అభిమానులు !

Seetha Sailaja

లేటెస్ట్ గా ఒక ప్రముఖ ఛానల్ లో ప్రసారం అయిన ‘అలీ తో సరదాగా’ కార్యక్రమానికి అతిధిగా వచ్చిన అల్లు అరవింద్ మాట్లాడుతూ తమ కుటుంబానికి మెగా ఫ్యామిలీకి గ్యాప్ ఉంది అంటూ వస్తున్న వార్తలు అన్నీ అవాస్తవాలు అని అంటూ అనునిత్యం తమ రెండు కుటుంబాల మధ్య ఉన్న ప్రేమానురాగాలను అందరికీ తెలిసేలా వీడియోలు పెట్టాలా అంటూ కామెంట్ చేసాడు. ఈ కార్యక్రమం ప్రసారం అయి కొన్ని రోజులు గడవకుండానే అల్లు అర్జున్ అభిమానులు మెగా హీరోల మౌనానికి అర్థాలు వెతకడం ప్రారంభించారు.


ఇలా బన్నీ అభిమానులు అర్థాలు వెతకడానికి ఒక ఆసక్తికర కారణం కనిపిస్తోంది. లేటెస్ట్ గా జరిగిన ఫిలిం ఫేర్ అవార్డుల ఫంక్షన్ లో అల్లు అర్జున్ కు ఉత్తమనటుడు అవార్డు వచ్చింది. ‘పుష్ప’ మూవీలో అతడు చూపించిన అద్వితీయమైన నటనకు ఫిలిం ఫేర్ అవార్డు దక్కింది.


దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే బన్నీకి ఈవిషయమై మెగా హీరోలు స్పందించి అతడికి అభినందనలు తెలపకపోవడం బన్నీ అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈమధ్య జరిగిన రాజమౌళి పుట్టినరోజునాడు అతడిని అభినందిస్తూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టిన రామ్ చరణ్ కు బన్నీకి ఫిలిం ఫేర్ అవార్డ్ వచ్చిన విషయం తెలియదా అంటూ అల్లు అర్జున్ అభిమానులు మధన పడుతున్నారు.


సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే సాయి ధరమ్ తేజ్ కూడ అల్లు అర్జున్ కు ఫిలిం ఫేర్ అవార్డు వచ్చిన సందర్భంగా స్పందించకపోవడం కూడ బన్నీ అభిమానులను ఆశ్చర్య పరుస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తేయితే బన్నీ తమ్ముడు అల్లు శిరీష్ తన లేటెస్ట్ మూవీ ‘ఊర్వశివొ రాక్షసివో’ సినిమాకు సంబంధించిన పాటను తన అభిమానులకు సోషల్ మీడియాలో షేర్ చేసాడు కానీ అతడు కూడ తన అన్నకు ఫిలిం ఫెయిర్ అవార్డు వచ్చిన విషయాన్ని తన అభిమానులకు షేర్ చేయకపోవడం మరొక ట్విస్ట్ అన్నమాటలు వినిపిస్తున్నాయి..



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: