మెగా 154 ... షూటింగ్ పిక్స్ వైరల్..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీ లలో హీరోగా నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరో లలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరస మూవీcలలో హీరోగా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే.
 


అందులో భాగంగా తాజాగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ మూవీ అక్టోబర్ 5 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ప్రేక్షకుల అంచనాలను అందుకొని ప్రస్తుతం అద్భుతమైన కలెక్షన్ లను బాక్సాvఫీస్ దగ్గర వసూలు చేస్తుంది.
 


ఇది ఇలా ఉంటే చిరంజీవి ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ దర్శకులలో ఒకరు అయినటువంటి బాబి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. 
 


ఇప్పటి వరకు ఈ మూవీ కి టైటిల్ ని ఫిక్స్ చేయలేదు. దానితో ఈ సినిమా చిరంజీవి కెరీర్ లో 154వ మూవీ గా తెరకెక్కుతూ ఉండటంతో , మెగా 154 అనే టైటిల్ తో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుంది. ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తూ ఉండగా ,  శృతి హాసన్ ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది.


మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ లో మాస్ మహారాజా రవితేజ ఒక కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ  షూటింగ్ స్పాట్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. ఈ లీక్ అయిన ఫోటోలలో మెగాస్టార్ చిరంజీవి అదిరిపోయే స్టైలిష్ లుక్ లో ఉన్నాడు. ఈ మూవీ షూటింగ్ స్పాట్ నుండి లీక్ అయిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: