నాగార్జున తో మరోసారి అలా చేస్తానని నమ్మించి మోసం చేసిన స్టార్ హీరోయిన్..!!
కేవలం టాలీవుడ్ హీరోయిన్లు మాత్రమే కాకుండా కోలీవుడ్,బాలీవుడ్, హాలీవుడ్ హీరోయిన్లతో సైతం నాగార్జున నటించారు. అయితే తన సినీ కెరీర్ లోనే మొదటి సారి ఓ హీరోయిన్ తో నటించాక ఇంకోసారి ఆ హీరోయిన్ ముఖం కూడా చూడకూడదని అనుకున్నారట నాగార్జున. మరి ఆ హీరోయిన్ ఎవరో? ఎందుకు నాగార్జున అలా అనుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాం. మన్మధుడు సినిమా నాగార్జున సినీ కెరీర్ లోనే ఒక బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.
ఈ సినిమా టీవీలో ఇప్పుడు వచ్చినా కూడా చాలా మంది ఆసక్తిగా చూస్తారు. ఇక ఈ సినిమాలో నాగార్జున నటన సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. ఈ సినిమా చూశాక చాలా మంది స్టార్ హీరోల భార్యలు నాగార్జున కు ఫిదా అయిపోయారు. ఇక మన్మధుడు సినిమాలో హీరోయిన్ గా అన్షు అంబానీ, సోనాలి బింద్రే నటించారు. మొదట అన్షు అంబానీతో కొన్ని సన్నివేశాలు జరిగాక ఆ తరువాత సోనాలి బింద్రే ఎంట్రీ ఇస్తుంది.ఇక వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అన్ని సన్నివేశాలు సినీ ప్రియులకు బాగా కనెక్ట్ అయ్యాయి. అయితే ఆ సినిమా చేసే టైంలో సోనాలి బింద్రే నాగార్జున ను ఓ విషయంలో మోసం చేసిందట. అదేంటంటే.. సోనాలి బింద్రే, నాగార్జున చేసే మరో సినిమాలో కూడా హీరోయిన్ గా చేస్తానని చెప్పి మాట ఇచ్చిందట.
అయితే తెరపై వీళ్ళ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవడంతో చాలా మంది ప్రేక్షకుల్లో ఈ జంటకు మంచి మార్కులు పడ్డాయి. ఇక వీళ్ళిద్దరూ చాలా రోజుల పాటు మంచి స్నేహితులుగా కూడా మారిపోయారు. ఇక కొన్ని రోజుల తర్వాత నాగార్జున తన సినిమాలో హీరోయిన్ గా సోనాలి బింద్రే ని తీసుకుందామని స్వయంగా కలిసి సినిమాలో నటించమని కోరారట. కానీ సోనాలి బింద్రే ఏం మాట్లాడకుండా ఉండిపోయారట. అంతేకాదు ఒకానొక టైంలో ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయకుండా నాగార్జునను హార్ట్ చేసిందట. అంతేకాకుండా ఓ ఈవెంట్ లో కూడా నాగార్జునను సోనాలి బింద్రే అవాయిడ్ చేసిందట. ఇక ఈ కారణంతో నాగార్జున మళ్లీ సోనాలి బింద్రే మొహం కూడా చూడకూడదని నిర్ణయించుకున్నారట.