గత కొన్ని నెలలుగా బాలివుడ్ లో సరైన హిట్ సినిమా పడలేదు..కానీ తెలుగు లో మాత్రం వరుస హిట్ సినిమాలు పడుతూన్నాయి..తాజాగా మరో సినిమా కూడా హిట్ గా నిలిచింది.టాలీవుడ్ కంటెంట్ దెబ్బకు.. నార్త్ థియేటర్స్ షేకవడం ఆగడం లేదు. బాహుబలితో మొదలైన ఈ ట్రెండ్ ఇప్పటికీ నాన్ స్టాప్ గా కంటిన్యూ అవుతూనే ఉంది. బాలీవుడ్ మేకర్స్ కంటిపై కునుకులేకుండా చేస్తూనే ఉంది. ఇక నిన్నమొన్నట వరకు కార్తికేయ2 తో కుదేలైన బాలీవుడ్ బాక్సాఫీస్ ఇప్పుడు గాడ్ ఫాదర్ అరాచకాన్ని విట్ నెస్ చేసేందుకు రెడీ ఉంది. అంతకంతకూ పెరుగుతున్న స్పందన తో చేతులెత్తేసింది. థియటేర్స్‌ను గాడ్ ఫాదర్ దారాదత్తం చేసింది..
చిరంజీవి మోస్ట్ అవేటెడ్ మూవీ గాడ్ ఫాదర్ .. ఇప్పుడు ఇండియాను షేక్ చేస్తోంది. వంద కోట్ల క్లబ్ వైపు పరుగెడుతోంది. దరసరా కానుకగా.. తెలుగు, హిందీ లాంగ్వేజెస్ లో రిలీజైన ఈ .. అంతకంతకూ.. ఆడియెన్స్ రెస్పాన్స్ పెంచేసుకుంటోంది. మలయాళ సూపర్ హిట్ మూవీ లూసీఫర్ కు రీమేక్ గా ఈ వచ్చిన విషయం తెలిసిందే. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ అతిథి పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు.. ఇక ఇప్పుడు ఈ ఒరిజినల్ కంటే బాగుంది అనే టాక్ ను సొంతం చేసుకుంది.
అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా కీలక పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు.ముఖ్య పాత్రల్లో సునీల్, సత్యదేవ్, అనసూయ నటించారు. ఈ ఇప్పుడు సూపర్ హిట్ సాధించడంతో చిత్రయూనిట్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక సూపర్ హిట్ అవ్వడంతో బాలీవుడ్ లో ఈ స్క్రీన్స్ సంఖ్యను నార్త్‌లో పెంచారు మేకర్స్ .ఇప్పటికే ఉన్న స్క్రీన్స్ ను 600 లకు పైగా పెంచారు.హృతిక్ విక్రమ్ వేద ను కాదని.. చిరు గాడ్ ఫాదర్ కు ఇన్ని స్క్రీన్లను పెంచడం.. ఇప్పుడు నార్త్‌లో హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ ఆదిపత్యం పెరుగుతోందనే వాదన వినిపిస్తోంది..చివరికి ఈ వాదన ఎన్ని చర్చలకు దారి తీస్తుంధొ చూడాలి..