"ఆది పురుష్" మూవీ ఎవరిని నిరాశపరచదు... ఓం రౌత్..!

Pulgam Srinivas
బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు ఆయన ఓం రౌత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఓం రౌత్ "తానాజీ" మూవీ తో బాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ దర్శకుడు రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఆది పురుష్ అనే మూవీ ని తెరకెక్కించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటించింది.


ఈ మూవీలో సైఫ్ అలీ ఖాన్ ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఆది పురుష్ మూవీ నుండి చిత్ర బృందం టీజర్ ను విడుదల చేసిన విషయం మన అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఆది పురుష్ మూవీ టీజర్ కు ప్రతికూల స్పందనలు వచ్చాయి. దానితో తాజాగా ఓం రౌత్ స్పందించాడు.


తాజాగా ఓం రౌత్ "ఆది పురుష్"  టీజర్ కు వస్తున్న ప్రతికూల స్పందనాలపై స్పందిస్తూ ... ఆది పురుష్ మూవీ పై తాను పూర్తి నమ్మకంతో ఉన్నట్లు తెలియజేశాడు. బిగ్ స్క్రీన్ కోసమే ఈ సినిమాను సిద్ధం చేశాము అని చెప్పు కొచ్చాడు. చిన్న వీడియోను చూసి మూవీ పై అంచనాలకు రావద్దు అని అన్నాడు. వచ్చే ఏడాది జనవరి 12 వ తేదీన ఈ సినిమా విడుదల అయ్యాక చూసి ఎవరు కూడా నిరాశ చెందరు ,  అని కావాలి అంటే నోటు రాసి ఇస్తాను అని ఓం రౌత్ పేర్కొన్నాడు. తప్పకుండా ఆది పురుష్ సినిమా అందర్నీ అలరిస్తోంది అని ఓం రౌత్ చెప్పు కొచ్చాడు. ఇది ఇలా ఉంటే ఆది పురుష్ మూవీ పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: