గాడ్‌ఫాదర్‌ రెస్పాన్స్..అక్కడ కూడా 600 థియేటర్లు..

Satvika
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్‌ఫాదర్‌ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది..మంచి హిట్ టాక్ ను అందుకుంది..ఆచార్య తో నిరాశ పడిన ఫ్యాన్స్ ఈ సినిమా తో భారీ హిట్ ను అందుకున్నాడు.ఇది మెగా ఫ్యాన్స్ పండగే అని చెప్పాలి..చాలా కాలం తర్వాత భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు చిరు. మలయాళం హిట్ చిత్రం లూసీఫర్ రీమేక్‏గా వచ్చిన ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా మార్పులు చేశారు డైరెక్టర్ మోహన్ రాజా. అంతేకాకుండా ఇందులో నయనతార, సల్మాన్ ఖాన్ కీలకపాత్రలలో నటించడం సినిమా కు మరో హైలెట్ అయ్యింది.

విడుదలైన మూడు రోజుల్లోనే రూ. 100 కోట్లకు చేరువలో ఉంది గాడ్ ఫాదర్ చిత్రం. ఇక వీకెండ్ కావడంతో.. ఈ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.కేవలం తెలుగులోనే కాకుండా హిందీలోనూ గాడ్ ఫాదర్ జోరు కొనసాగుతుంది. ఉత్తరాదిలోనూ ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. నార్త్ ఆడియన్స్ నుంచి వస్తోన్న రెస్పాన్స్ దృష్టిలో పెట్టుకుని చిత్రయూనిట్ మరో అడుగు ముందుకు వేసింది.ఈ హిందీ వెర్షన్‍కు శనివారం నుంచి మరో 600 స్క్రీన్స్ పెంచినట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిరు ఓ స్పెషల్ వీడియోల్ రిలీజ్ చేశారు.

గాడ్ ఫాదర్ పై మీరు చూపిస్తున్న ప్రేమాభిమానానికి ధన్యవాదాలు. విడుదలైన రెండురోజుల్లోనే మీ రూ. 69 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినందుకు చాలా సంతోషం. హిందీ బెల్డ్ లో మరో 600 స్క్రీన్స్ పెంచుతున్నాం. మా ను పాన్ ఇండియా మూవీగా చేసినందుకు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చారు చిరు. ఈ కు తమన్ మ్యూజిక్ అందించగా.. సత్యేదేవ్, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలలో నటించారు..ఈ సినిమా మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.. ఇది మెగాస్టార్ చిరంజీవికి కాసుల వర్షాన్ని కురిపిస్తుంది..ఇప్పుడు మరో రిమెక్ లో నటిస్తున్నారు.. ఆ సినిమా ఎలాంటి టాక్ ను అందిస్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: