టాలీవుడ్ అగ్ర నటుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ తన కొత్త సినిమాను మొదలుపెట్టిన విషయం తెలిసిందే. SSMB 28వ ప్రాజెక్టుగా తెరపైకి రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు అయితే అసలు మామూలుగా లేవు.తప్పకుండా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది అని ఫ్యాన్స్ తో పాటు సినీ ప్రముఖులు కూడా ఇప్పటికే పాజిటివ్ గా స్పందించారు.అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మొదటి షెడ్యూల్ ఇటీవల జెట్ స్పీడ్ లోనే పూర్తి చేశారు. ఇక మరొక షెడ్యూల్ను కూడా వీలైనంత తొందరగా మొదలు పెట్టాలని అనుకున్నారు. అయితే సెకండ్ షెడ్యూల్ కొంత ఆలస్యంగా మొదలవుతుంది వార్తలు అయితే వచ్చాయి. ఎందుకంటే ఇటీవల మహేష్ బాబు తల్లి గారు కన్నుమూయడంతో మహేష్ బాబు ఇప్పట్లో సినిమా షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశాలు లేదు అని టాక్.అయితే ఇటీవల కర్మ ఆచారాలను ముగించిన మహేష్ బాబు కొంత రెస్టు తీసుకొని మళ్లీ యధావిధిగా షూటింగ్లతో బిజీ కావాలని అనుకుంటున్నాడు.
ఇక త్రివిక్రమ్ ప్రాజెక్టుకు సంబంధించిన మరొక ప్లానింగ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. నవంబర్ 4 వ తేదీన తేదీన సెకండ్ షెడ్యూల్ మొదలుపెట్టాలని అనుకుంటున్నారు. ఈ షూటింగ్లో కొంత ఫ్యామిలీ సన్నివేశాలను అలాగే సీరియస్ వార్నింగ్ సన్నివేశాలను పూర్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ షెడ్యూల్ ను కూడా వీలైనంత తొందరగా పూర్తి చేయాలి అని త్రివిక్రమ్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇదే ఏడాది నవంబర్ లో లేదా 2023 జనవరి లోపు ఫినిష్ చేయాలని అనుకుంటున్నారు. ఇక సినిమాను 2023 మార్చి లో థియేటర్లలో విడుదల చేయాలని ప్లాన్. ఇక ప్రమోషన్స్ మాత్రం 2023 జనవరి నుంచి మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్ర కోసం ప్రముఖ నటుడు పృథ్విరాజ్ ను కూడా సంప్రదించారు. ఇక పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు