నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పటికే ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో అన్ స్టాపబుల్ అనే టాక్ షో కు హోస్ట్ గా వ్యవహరించిన విషయం అందరికీ తెలిసిందే. ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టపబుల్ టాక్ షో సీజన్ 1 అద్భుతమైన విజయం సాధించింది. దానితో ఆహా నిర్వాహక బృందం బాలకృష్ణ హోస్ట్ గా ఆన్ స్టాపబుల్ సీజన్ 2 అనే టాక్ షో ను ప్రారంభించబోతుంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ ప్రకటించింది. అలాగే ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్రసారం కాబోతున్న సీజన్ 2 టాక్ షో కు పలువురు సెలబ్రిటీలు రానున్నట్లు కొంతమంది పేర్లు కొన్ని రోజులుగా బయటికి వస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అన్ స్టాపబుల్ సీజన్ 2 టాక్ షో కు నారా చంద్రబాబు నాయుడు , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ , మంచు లక్ష్మి ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నట్లు తెలుస్తోంది. మరి ఇప్పటి వరకు ఈ విషయాలను ఆహా నిర్వాహ బృందం మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. ఇది ఇలా ఉంటే ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతున్న అన్ స్టపబుల్ సీజన్ 2 కోసం నందమూరి బాలకృష్ణ అభిమానులతో పాటు మామూలు ప్రేక్షకులు కూడా ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. మరి ఆన్ స్టాపబుల్ సీజన్ 2 ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.