రోజా వారసురాలి ఎంట్రీ సిద్ధం....!!

murali krishna
వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రి రోజా. సినీ నటిగా గుర్తింపు పొంది పొలిటికల్ గానూ రాణించారు. ఇప్పుడు రోజా బాటలోనే కుమార్తె ఎంట్రీ ఇవ్వటానికి సిద్దం అవుతున్నట్లుగా తెలుస్తోంది.
రోజా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా నిలిచారు. భర్త సెల్వమణి ప్రముఖ సినీ డైరెక్టర్. దక్షిణాది భాషల్లో సినిమాలు తీసారు. రోజాతో చామంతి సినిమా తీయటం..ఆ తరువాత ఇద్దరి వివాహానికి తొలి అడుగు అక్కడే పడింది. రోజా కుమార్తె అన్షు మాలిక ఇప్పుడు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

రోజా బాటలోనే కుమార్తె అన్షు
రోజా - సెల్వమణి ఇద్దరూ సినీ రంగానికి చెందిన వారే కావటంతో ఇప్పుడు అన్షుకు సినీ రంగంలోకి ఎంట్రీ సాధారణంగానే పరిగణించాల్సి ఉంటుంది. రోజా రాజకీయాల్లోకి ప్రవేశించిన తరువాత క్రమేణా సినిమాలు తగ్గించేసారు. వైసీపీ నుంచి తొలి సారి 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా ఉంటూనే.. మంత్రి పదవి ప్రకటించిన రోజు వరకూ జబర్ధస్త్ కార్యక్రమంలో జడ్జిగా వ్యవహరించారు. కొన్ని స్కిట్స్ లోనూ నటించారు. మంత్రి అవుతూనే ఆ కార్యక్రమానికి వీడ్కోలు పలికారు. జబర్దస్థ్ వేదికగానే తన పిల్లలిద్దరినీ ప్రేక్షకులకు రోజా పరిచయం చేసారు. రోజా కుమార్తె అన్షు మాలిక రచయిత. పుస్తకాలను రాసారు. పలు అవార్డులను గెలుపొందారు. పలు మ్యాగజైన్ కవర్ పేజెస్‌పై ఫిక్షనల్ రైటర్‌గా గుర్తింపు పొందారు.
నిర్మాత - హీరో సిద్దమంటూఇప్పుడు రోజా సినిమాలకు పూర్తిగా దూరం కావటంతో.. కుమార్తె అన్షు సినిమాలకు దగ్గర అవుతారని చెబుతున్నారు. అన్షు తన తొలి సినిమాను ప్రముఖ హీరో విక్రమ్ కుమారుడు ధ్రువ్ విక్రమ్ తో కలిసి నటించనున్నారని తెలుస్తోంది. కోబ్రా దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తారని ఇండస్ట్రీ టాక్. ఇప్పటికే అన్షు కోసం పలు కధలు రెడీగా ఉన్నట్లుగా చెబుతున్నారు. సెల్వరాజ్‌తో ధ్రువ్ ఓ సినిమాను చేయాల్సి ఉంది. ఆ ప్రాజెక్టు పూర్తి కాగానే అన్షుతో సినిమాను పట్టాలెక్కిస్తారని సమాచారం. వచ్చే ఎన్నికల కోసం మంత్రి రోజా సమాయత్తం అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ గెలుపొంది నగరి నుంచి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్నారు.
ప్రతిపక్షాలు- టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా విమర్శలు చేయటంలో రోజా ముందుంటారు. అయితే, తాజాగా సీఎం జగన్ నిర్వహించిన పార్టీ వర్క్ షాపులో రోజా గడపగడపకు ప్రభుత్వ నిర్వహణలో వెనుకబడి ఉన్నారని తేల్చారు. నియోజకవర్గంలో మరింగా సమయం కేటాయిచాలని సీఎం జగన్ నిర్దేశించారు. అటు ప్రతిపక్ష పార్టీలు టీడీపీ - జనసేన వచ్చే ఎన్నికల్లో రోజా లక్ష్యంగా నగరి పైన గురి పెట్టాయి. ఈ సమయంలోనూ కుమార్తె అన్షు సినీ రంగ ప్రవేశం పైనా చర్చ జరుగుతోంది. దీంతో..ఇప్పుడు రోజా తన కుమార్తె సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ పైన అధికారికంగా ఏం చెబుతారనేది అటు సినీ పరిశ్రమ తో పాటుగా రోజా అభిమానుల్లోనూ ఆసక్తి పెంచుతోంది.
నగరిలో హ్యాట్రిక్ కోసం రోజా ఫోకస్ప్రతిపక్షాలు- టీడీపీ అధినేత చంద్రబాబు లక్ష్యంగా విమర్శలు చేయటంలో రోజా ముందుంటారు. అయితే, తాజాగా సీఎం జగన్ నిర్వహించిన పార్టీ వర్క్ షాపులో రోజా గడపగడపకు ప్రభుత్వ నిర్వహణలో వెనుకబడి ఉన్నారని తేల్చారు. నియోజకవర్గంలో మరింగా సమయం కేటాయిచాలని సీఎం జగన్ నిర్దేశించారు. అటు ప్రతిపక్ష పార్టీలు టీడీపీ - జనసేన వచ్చే ఎన్నికల్లో రోజా లక్ష్యంగా నగరి పైన గురి పెట్టాయి. ఈ సమయంలోనూ కుమార్తె అన్షు సినీ రంగ ప్రవేశం పైనా చర్చ జరుగుతోంది. దీంతో..ఇప్పుడు రోజా తన కుమార్తె సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ పైన అధికారికంగా ఏం చెబుతారనేది అటు సినీ పరిశ్రమ తో పాటుగా రోజా అభిమానుల్లోనూ ఆసక్తి పెంచుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: