ఆ హీరోయిన్ ను చూస్తుంటే అసూయగా ఉందంటున్న మీనా..!!

Anilkumar
టాలీవుడ్ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం హీరోయిన్ గా తెలుగు తమిళ సినిమాలలో అగ్ర హీరోలు అందరి సరసన నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి మీనా.అయితే ఈమె తెలుగు తమిళ భాషలలో ఒకానొక సమయంలో అగ్రహతారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు అయితే ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే మీనా వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు.  ఒక కూతురికి జన్మనిచ్చిన తర్వాత మీనా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.

అయితే ఇలా ఈమె తన సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్న నేపథ్యంలోనే తన భర్త మరణించడంతో మీనా ఎంతో కృంగిపోయారు ఇప్పుడిప్పుడే తన భర్త మరణం నుంచి బయటపడుతున్నటువంటి మీనా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.ఇకపోతే గత కొద్ది రోజుల క్రితం మీనా స్నేహితులందరూ కలిసి తన పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు.అంతేకాదు  అలాగే తన స్నేహితురాలితో కలిసి

 విదేశీ పర్యటనకు వెళ్లిన మీన అక్కడి ఫోటోలు వీడియోలను అభిమానులతో పంచుకున్నారు.ఇక ఇదిలా ఉండగా తాజాగా ఈమె బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేస్తూ చేసినటువంటి ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.అయితే  ఐశ్వర్యరాయ్ పొన్నియన్ సెల్వన్ సినిమాలో నందిని పాత్రలో నటించారు. ఇక ఈ క్రమంలోనే తన ఫోటోని షేర్ చేస్తూ నా డ్రీమ్ ప్రాజెక్టులో ఐశ్వర్యరాయ్ నటించారు.అయితే  అందుకే తనని చూస్తుంటే చాలా అసూయగా ఉంది. అంతేకాదు అలాగే నా జీవితంలో మొదటిసారి ఒకరిని చూసి అసూయ పడుతున్నాను అంటూ ఈ సందర్భంగా ఈమె ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: