కృష్ణంరాజు గారికి ఉన్న ఆ ఒక్క అలవాటే ఆయన్ని కష్టాలపాలు చేసింది.....!!

murali krishna
రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈ మధ్యనే అనారోగ్యంతో కన్నుమూశారు. ఈయన సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించి మంచి పేరు సంపాదించుకున్నారు.
ఇక ఈయన చనిపోయిన తర్వాత ఈయనకు సంబంధించి ఎన్నో విషయాలు బయటికి వస్తున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళితే.. కృష్ణం రాజు గారికి చదువు పూర్తయ్యాక సినిమాల్లోకి అడుగు పెట్టాలనేది ఆయన కల. ఇదే విషయాన్ని తండ్రికి చెప్పడంతో కృష్ణం రాజు ని చెన్నైకి పంపించారు. ఇక అందరి లాగే ఈయన కూడా అవకాశాల కోసం ఎన్నో తంటాలు పడ్డారు. మొదటి సినిమాతోనే ఈయన తనలో ఉన్న నటుడి ని బయట పెట్టి అందరితో ప్రశంసలు అందుకున్నారు.కానీ ఆ తర్వాత రెండు మూడు సంవత్సరాల వరకు ఏ సినిమాలో ఛాన్స్ రాలేదు.ఇక ఆయన అప్పట్లో విలన్గా చేయమంటే నేను అస్సలు చేయను అని నిక్కచ్చిగా చెప్పేవారట.
ఇక కృష్ణంరాజు గారు పెద్ద జమీందారు కుటుంబం నుంచి వచ్చినప్పటికీ తిండి లేక పస్తులు ఉండాల్సిన ఓ సందర్భం వచ్చిందట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇదే నిజం. కృష్ణం రాజు గారు ఛాన్సుల కోసం ఆఫీసుల చుట్టూ తిరిగినప్పుడు తన చేతిలో డబ్బులు లేక కొన్ని రోజుల వరకు తిండి లేక పస్తులున్నారట. కానీ తన దగ్గర డబ్బులు లేక పోయిన ఎవరికీ ఈ విషయం చెప్పేవారు కాదట. ఇక అదే టైంలో కృష్ణంరాజు సన్నిహితుడు చెన్నై కి రావడంతో అతన్ని కలిశాడు. ఇక ఆయన అవతారం చూసి ఏంటి ఇలా తయారు అయ్యావని అడిగితే ఏం లేదు నేను బాగానే ఉన్నాను అని చెప్పారట. ఇక అనుమానం తో మళ్ళీ అతన్ని కలిసి ఏమైంది అని అడిగితే అప్పటికి కూడా కృష్ణంరాజు నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పలేదు.
కానీ ఆయన పరిస్థితిని అర్ధం చేసుకున్న అతని సన్నిహితుడు డబ్బులు లేవు అని చెప్పొచ్చు కదా అని అన్నారు. దాంతో ఆ సన్నిహితుడు కృష్ణంరాజు ని పట్టుబట్టి మరీ ఒక హోటల్ కి తీసుకువెళ్లి కడుపునిండా భోజనం పెట్టించారట. అంతేకాదు తన దగ్గర డబ్బులు ఉన్నవి కృష్ణం రాజు కి ఇచ్చేస్తే వద్దు అని చెప్పారట. ఇక ఈ విషయం తెలుసుకున్న కృష్ణంరాజు తండ్రి చాలా బాధ పడ్డారట. నా కొడుకు ఇలాంటి కష్టాలు ఎందుకు అనుభవిస్తున్నాడని చాలా బాధ పడ్డారట. ఇక దాంతో అప్పటినుండి ఆ రోజుల్లోనే వారానికి మూడు వందల రూపాయలు మనీ ఆర్డర్ చేసేవారట కృష్ణంరాజు తండ్రి. ఇక కృష్ణం రాజు గారికి ఉన్న మొహమాటం అనే అలవాటుతో చాలా రోజులు తిండి తిప్పలు లేక కష్టాలు పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: