పాపం.. అందరి ముందే.. వర్ష పరువు తీసేసిన ఇమాన్యుయల్?

praveen
సాధారణంగా ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు అని చెప్పాలి. ఎందుకంటే సినిమాల్లో దొరకని ఎంటర్టైన్మెంట్ ని ఎన్నో ఏళ్ల నుంచి బుల్లితెర ప్రేక్షకులందరికీ కూడా అందిస్తుంది జబర్దస్త్ కార్యక్రమం. ఇక జబర్దస్త్ ద్వారా ఎంతో మంది కమెడియన్స్ కు ఇండస్ట్రీలోకి రావడానికి ఒక మంచి మార్గం దొరికింది అని చెప్పాలి. కాగా జబర్దస్త్ లో ఎప్పుడూ కొన్ని రకాల జంటలు తెర మీదికి వచ్చి హాట్ టాపిక్ గా మారిపోతూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇలా జబర్దస్త్ లో హైలెట్ గా మారిన జోడి వర్ష, ఇమ్మానియేల్.

 జబర్దస్త్ జడ్జిగా రోజా ఉన్న సమయంలో వీరి జోడి కి బ్లాక్ అండ్ వైట్ జోడి అని ఏ ముహూర్తాన ఆమె పేరు పెట్టిందో కానీ ఇక అప్పటి నుంచి వీరిద్దరి జోడి కూడా జబర్దస్త్ లో తెగ హాట్ టాపిక్ గా మారిపోయింది అన్న విషయం తెలిసిందే. ఇక వీరిద్దరి మధ్య ఉన్న లవ్ ట్రాక్  కారణంగానే కొన్ని షోల కంటెంట్ కూడా రెడీ చేస్తూ ఉండేవారు ఈటీవీ నిర్వాహకులు. ఈ మధ్యకాలంలో మాత్రం వీరి జోడి పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతుంది. అయినప్పటికీ అప్పుడప్పుడు వీరిద్దరు ప్రేక్షకుల ముందుకు వస్తూ అలరిస్తూ ఉండడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 అయితే సాధారణంగా ఇమ్మానుయేల్ అటు వర్ష గురించి ఎంతో గొప్పగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ ఇటీవల జబర్దస్త్ లో ఒక స్కిట్లో భాగంగా వర్ష పరువు తీసేసాడు ఇమాన్యుయల్. బుల్లెట్ భాస్కర్ స్కిట్ లో భాగంగా సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన బంగారం అనే రీల్ తీసుకుని ఇక వర్ష ఆ డైలాగ్ చెప్పడానికి ప్రయత్నిస్తుంది. బంగారం నన్ను అందరూ అడుగుతున్నారు అంటూ వర్షా ఇమ్మానుయేల్ తో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది. అంతలో అందుకున్న ఇమాన్యుయల్ ఏమని నువ్వు ఆడ మగ అని అడుగుతున్నారా అంటూ పరువు తీసేస్తాడు. ఇక ఇమాన్యుల్ ఇలాంటి పంచ్ వేయడంతో వర్ష ఒక్కసారిగా షాక్ అవుతుంది. అక్కడున్న వారు అందరూ నవ్వుకుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: