ఇంటరెస్టింగ్ అప్డేట్ ఫ్రమ్ శివకార్తికేయన్....!!ది ప్రిన్స్...??

murali krishna
కోలీవుడ్‌ హీరోలు ప్రస్తుతం టాలీవుడ్‌లో మార్కెట్‌ను పెంచుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే నేరుగా తెలుగు దర్శకులతోనే చేతులు కలుపుతున్నారు.
ఇప్పటికే పలువురు స్టార్‌ హీరోలు టాలీవుడ్‌ డైరెక్టర్‌లతో సినిమాలను చేస్తున్న విషయం తెలిసిందే.
 కోలీవుడ్‌ హీరోలు ప్రస్తుతం టాలీవుడ్‌లో మార్కెట్‌ను పెంచుకునే పనిలో ఉన్నారు. ఈ క్రమంలోనే నేరుగా తెలుగు దర్శకులతోనే చేతులు కలుపుతున్నారు. ఇప్పటికే పలువురు స్టార్‌ హీరోలు టాలీవుడ్‌ డైరెక్టర్‌లతో సినిమాలను చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఆ తమిళ హీరోల లిస్ట్‌లో శివకార్తికేయన్‌ ఒకడు. 'రెమో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన శివ కార్తికేయన్‌ 'డాక్టర్', 'డాన్' వంటి వరుస హిట్లతో టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్‌ను ఏర్పరుచుకున్నాడు. ఈ క్రమంలో శివ నేరుగా తెలుగులో 'ప్రిన్స్' అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ఇక్కడి ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. 'జాతిరత్నాలు' ఫేం అనుదీప్ కేవి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుంది. కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం దీపావళికి విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్‌డేట్‌లను ప్రకటిస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు.
తాజాగా మేకర్స్‌ ఈ సినిమా సెకండ్‌ సింగిల్‌ అప్‌డేట్‌ను ప్రకటించారు. ‘జెస్సికా’ అంటూ సాగే లవ్‌సాంగ్‌ను గురువారం సాయంత్రం 5.౩౦ నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఇప్పటికే విడుదలైన ‘బింబిలికిపిలాపి’ పాటకు శ్రోతల నుండి విశేష స్పందన వచ్చింది. ఈ చిత్రానికి ఎస్‌.ఎస్‌. థమన్ సంగీతం అందిస్తున్నాడు. శివ కార్తికేయన్‌కు జోడీగా మారియా ర్యాబోషప్క హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ ఎల్ఎల్‌పి, సురేష్ ప్రొడక్షన్స్‌, శాంతి టాకీస్ బ్యానర్‌లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మొదట ఈ చిత్రాన్ని ఆగస్టు 31న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమాను రెండు నెలలు పోస్ట్ పోన్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: