పాపం: బేబమ్మని అప్పుడే ద్వేషిస్తున్నారా..?
మొన్నటి వరకు ఉప్పెన సినిమాకు సంబంధించి పలు పోస్టర్లతో సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో క్రేజీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఒక్కసారిగా క్లాసులు అందుకోవటంతో ట్రోలింగ్ బారిన పడటం జరుగుతోంది. ఇక కొంతమంది ఈమెను ఐరన్ లెగ్ అని కూడా కామెంట్లు చేస్తూ ఉన్నారు. సాధారణంగా సినిమాలు విజయం అందుకుంటే చాలు పొగడ్తలతో ముంచేస్తూ ఉంటారు.ఒకవేళ ఫ్లాప్ అయ్యిందంటే చాలు ఇలా ట్రోల్స్ చేయడం సర్వసాధారణంగా మారుతోంది.
అయితే ఇలాంటి నెగటివ్ ట్రోలింగ్, కామెంట్స్ మాత్రం ఎవరికి ఉపయోగపడవు అని కేవలం టాలెంట్ ఉంటే మళ్ళీ స్టార్స్ అయ్యే అవకాశం కూడా ఉందని మరి కొంతమంది ఇలా పాజిటివ్‌గా కూడా స్పందిస్తూ ఉన్నారు. ఇక ఆమె అభిమానులు మాత్రం ఈమె రాబోయే సినిమాలలో ఆచితూచి అడుగులు వేసి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నారు. ఇక రెమ్యూనరేషన్ విషయంలో కూడా కాస్త తగ్గినట్లుగా కూడా తెలుస్తోంది ఈ ముద్దుగుమ్మ.