రానున్న రోజుల్లో అదిరిపోయే రేంజ్ లో టాస్క్ లను ప్రిపేర్ చేస్తున్న 'బిగ్ బాస్ 6' మేకర్స్..?

Pulgam Srinivas
ఇండియా లోనే అత్యంత ప్రజాధరణ పొందిన రియాలిటీ షో లలో ఒకటైన బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా బుల్లి తెర ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండియా లో మొదట హిందీ లో ప్రారంభం అయిన బిగ్ బాస్ రియాలిటీ షో ప్రస్తుతం ఇండియా లో అనేక భాషలలో టెలికాస్ట్ అవుతూ వస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగు లో కూడా ప్రారంభం అయ్యి 5 సీజన్ లను విజయ వంతంగా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 కొనసాగుతుంది.

ఇది ఇలా ఉంటే తెలుగు లో ఇప్పటికే బిగ్ బాస్ 'ఓ టి టి' నాన్ స్టాప్ కూడా ఒక సీజన్ ని పూర్తి చేసుకుంది. ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ తెలుగు 6 వ సీజన్ కు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.  ఇప్పటి వరకు తెలుగు బిగ్ బాస్ మొదటి 5 సీజన్ లకు అదిరిపోయే రేంజ్ 'టి ఆర్ పి' రేటింగ్ రాగా బిగ్ బాస్ 6 వ సీజన్ కు మాత్రం మొదటి 5 సీజన్ లతో పోలిస్తే తక్కువ 'టి ఆర్ పి' రేటింగ్ వస్తున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అలా 6 వ సీజన్ కు తక్కువ 'టి ఆర్ పి' రేటింగ్ వస్తుండడంతో బిగ్ బాస్ నిర్వాహక బృందం ఈ షో 'టీ ఆర్ పి' రేటింగ్ పెంచేందుకు రాబోయే ఎపిసోడ్ లలో అదిరిపోయే రేంజ్ టాస్క్ లను ప్రిపేర్ చేస్తున్నట్లు ఆ టాస్క్ లతో 'టి ఆర్ పి' రేటింగ్ పెంచే ప్రణాళికలను వేస్తున్నట్లు ఒక వార్త నెట్టెంట వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: