ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. మళ్ళీ ఒక్కటవ్వబోతున్న చై- సామ్..?

Anilkumar
గౌతమ్ మీనన్ డైరెక్టర్ గా ఎన్నో సినిమాలు తెరకెక్కించిన సంగతి అందరికీ తెలిసిందే. అంతేకాదు ఈయన మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.ఇదిలావుంటే ఇక  ఈయన  తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొని కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు..అయితే గౌతమ్ మీనన్ మాట్లాడుతూ.. ఓటిటి వచ్చాక థియేటర్లకు రావడం చాలా మంది ప్రేక్షకులు మానేశారు.ఇకపోతే  ఏదో పెద్ద పెద్ద సినిమాలు విడుదలయితే తప్ప ఎక్కువగా థియేటర్లకు రావడం లేదు. అంతేకాదు చాలామంది చిన్న సినిమాలను ఓటిటి ద్వారానే చూస్తున్నారు. నిజాయితీగా చెప్పాలంటే మూవీ కి భాష లేదని లైఫ్ ఆఫ్ ముత్తు అనే సినిమాలో కొన్ని పాత్రలు హిందీ మాట్లాడతాయి.

కాగా  ఈ డైలాగ్స్ ప్రేక్షకులకు అర్థం కాకపోయినప్పటికీ అందులో ఉంటే భావం మాత్రం అర్థం అవుతుంది. అంతేకాదు నేను శింబుతో కలిసి గ్యాంగ్ స్టర్ అనే సినిమా తెరకెక్కించాను.ఇకపోతే  ది లైఫ్ ఆఫ్ ముద్దు అనే టైటిల్ తో ఈ సినిమాని తెలుగులో స్రవంతి మూవీస్ ఈ నెల 17న తెలుగులో రిలీజ్ చేయనున్నారు. అయితే  ఇక ఈ సినిమాలో ఒక చిన్న పల్లెటూరు లో ఉండే ముత్తు ముంబై వెళ్లి అనుకోకుండా చీకటి ప్రపంచంలో కి వెళ్తాడు. అక్కడి నుండి ఎలా బయట పడ్డాడు అనే కథాంశమే ఈ సినిమా. అయితే  ఇక ఈ సినిమా కథ డిమాండ్ చేయడంతో ఈ సినిమాని రెండు పార్టులుగా విడుదల చేస్తున్నాం.

కాగా ఈ సినిమాని తెలుగులో స్రవంతి రవి కిషోర్ విడుదల చేస్తున్నారు.అంతేకాదు  నేను నాగచైతన్యతో కలిసి ఏ మాయ చేసావే సినిమా చేయాలని అనుకుంటున్నాను అంటూ గౌతమ్ మీనన్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఇక  ఏ మాయ చేసావే 2 సినిమా చేయడం ఓకే గాని అందులో సమంత హీరోయిన్ గా ఒప్పుకుంటుందా లేదా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఏ మాయ చేసావే సినిమాలో సమంత నాగచైతన్య కలిసి నటించిన విషయం మనకు తెలిసిందే కదా...అయితే  ఒకవేళ సమంత ఒప్పుకోకపోతే ఈ సినిమాలో ఏ హీరోయిన్ ని పెట్టి తీస్తే హిట్ అవుతుంది అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: