ఆదిపురుష్ ను భయపెడుతున్న బ్రహ్మాస్త్ర అనుభవాలు !
పురాణాలలో వినిపించే ‘బ్రహ్మాస్త్రం’ చుట్టూ అల్లబడ్డ ఈ మూవీ కథ శివ తత్వంతో ఉన్నప్పటికీ ఈసినిమాలో అనవసరంగా అలియా భట్ రణబీర్ లవ్ ట్రాక్ ఎక్కువ అయి అసలు కథ గురించి ఇంట్రవెల్ వరకు వేచి చూడవలసి ఉండటంతో సగటు ప్రేక్షకుడు కొద్దిగా అసహనానికి లోనైనట్లు తెలుస్తోంది. ఈ మూవీ అసలు కథ సెకండ్ హాఫ్ లో మొదలైనప్పటికీ ఆ కథకు ఆయువుపట్టులా ఉండవలసి ఉన్న గ్రాఫిక్స్ వర్క్స్ ఊహించిన స్థాయిలో లేకపోవడంతో ప్రేక్షకుల అసంతృప్తి వల్ల ఈ మూవీకి డివైడ్ టాక్ వచ్చింది.
ఇప్పుడు దీని ప్రభావం ప్రభాస్ ‘ఆదిపురుష్’ పై పడే అవకాశం ఉంది అంటూ వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం రామాయణ గాధను ఇతివృత్తంగా తీసుకుని నిర్మాణం జరుపుకున్న ‘ఆదిపురుష్’ మూవీ అంతా గ్రాఫిక్స్ మీద ఆధారపడి ఉంది. అందరికీ తెలిసిన రామాయణ కథను కేవలం గ్రాఫిక్స్ మాయాజాలం తో మెప్పించడానికి ఈ మూవీని త్రీడీ టెక్నాలజీతో నిర్మిస్తున్నారు.
కేవలం గ్రాఫిక్స్ వర్క్స్ కోసంయే ఈ మూవీ నిర్మాణంలో వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ‘బ్రహ్మాస్త్ర’ మూవీ విషయంలో వందల కోట్లు ఖర్చుపెట్టిన గ్రాఫిక్స్ సగటు ప్రేక్షకుడుని మెప్పించ లేకపోయిన పరిస్థితులలో మళ్ళీ అటువంటి పొరపాటు జరగకుండా ‘రాథే శ్యామ్’ గ్రాఫిక్స్ విషయంలో ఒకటికి రెండు సార్లు సరి చూసుకోవాలని అవసరం అనుకుంటే రీ గ్రాఫిక్స్ వర్క్స్ ప్రారంభించాలని ఈ మూవీ దర్శక నిర్మాతలు భావిస్తున్నట్లుగా లీకులు వస్తున్నాయి..