అక్కడ మహేష్ ఎందుకు అంత ఎమోషనల్ అయ్యాడు..!!

Divya
రెబల్ స్టార్ కృష్ణంరాజు కు మన తెలుగు సినీ ఇండస్ట్రీ ఘనమైన నివాళి అర్పించింది. ఆదివారం రోజున తెల్లవారుజామున ఆయన మరణ వార్త తెలిసినప్పటి నుంచి సోషల్ మీడియా వేదికగా సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు, ఆయన అభిమానులు పలు రకాల పోస్టులతో తమ గౌరవాన్ని చాటుకున్నారు. ఇక కృష్ణంరాజు పార్థివ దేహం ఆయన ఇంటికి చేరుకున్నాక ఇండస్ట్రీలోని ప్రముఖులందరూ వచ్చి అక్కడ ఆయనకు నివాళులు అర్పించారు. అయితే ప్రముఖులు ఒక్కొక్కరు వచ్చినప్పుడు ప్రభాస్ చాలా ఎమోషనల్ అవ్వడం జరిగింది.అందుకు సంబంధించిన వీడియోస్ కూడా బయటికి రావడం జరిగింది.

అయితే నివాళి అర్పించి వెళ్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు చాలా తీవ్ర బాగోద్వేగానికి  గురికావడంతో  ఆయనను చూసిన అభిమానులు సైతం కదిలివేసింది. గతంలో కూడ మహేష్ బాబు ఇండస్ట్రీ ప్రముఖులు మరణించినప్పుడు నివాళులు అర్పించి వెళ్లడం జరిగింది. కానీ అంత ఎమోషనల్ ఎప్పుడు కూడా అవ్వలేదు.. అయితే కృష్ణంరాజుతో అతనికి మంచి అనుబంధమే ఉందని చెప్పవచ్చు ఎందుచేతంటే మహేష్ అంత దుఃఖానికి గురికావడానికి.. కారణం ఇదొక్కటే అని చెప్పవచ్చు.. ఆ సమయంలో తన సోదరుడు అయిన రమేష్ బాబు గుర్తుకు వచ్చి ఉండొచ్చని మరికొంతమంది అభిమానులు కూడా భావిస్తున్నారు. ఇక మహేష్ బాబు కరోనా బారిన పడి ఐసోలేట్  ఉన్న సమయంలో రమేష్ బాబు మరణించారు.

దీంతో ఇల్లు దాటి అసలు బయటికి రాలేదు మహేష్ తన అన్నయని కూడా చివరి చూపుకు కూడా నాచుకోలేదు బహుశా మహేష్ ఆ బాధ ఇప్పటికీ వెంటాడుతూ ఉండొచ్చని తెలుస్తోంది. తర్వాత మహేష్ దర్శించిన పార్థివ దేహం కృష్ణంరాజుదే కావడంతో మహేష్ బాబు ఇలా తన అన్నను గుర్తుకు తెచ్చుకొని ఎమోషనల్ అయ్యారని భావిస్తున్నారు. ఇక అంతే కాకుండా ప్రభాస్ తో కూడా మంచి బాండింగ్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుచేతనే అక్కడ కాస్త ఎక్కువ సమయాన్ని కేటాయించి కృష్ణంరాజు పార్థివ దేహం దగ్గరే ఉన్నారు మహేష్ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: