ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో జోరంత ఆ ముగ్గురు ముద్దుగుమ్మలదే..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం అనేక క్రేజీ మూవీ లు తేరకేక్కుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే దాదాపు ఎక్కువ శాతం మూవీ లలో హీరోయిన్ లుగా కేవలం ముగ్గురు ముద్దుగుమ్మల పేర్లు మాత్రమే వినిపిస్తూ వస్తున్నాయి. స్టార్ హీరోల మూవీ లను పక్కన పెడితే ,  మీడియం రేంజ్ హీరోల మూవీ లలో ఈ ముగ్గురు ముద్దుగుమ్మలే సందడి చేస్తూ వస్తున్నారు.


ఆ ముగ్గురు ముద్దుగుమ్మలు ఎవరో అని అనుకుంటున్నారా ...  ఆ ముద్దు గుమ్మలు మరెవరో కాదు.  ఉప్పెన మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలతో దూసుకుపోతున్న కృతి శెట్టి.  పెళ్లి సందD మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం వరుస అవకాశాలను దక్కించుకుంటున్న శ్రీ లీల. రొమాంటిక్ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి తన అంద చందాలతో కుర్రకారు మతి పోగొడుతున్న కేతిక శర్మ. ప్రస్తుతం ఈ ముగ్గురు ముద్దు గుమ్మ లు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మీడియం రేంజ్ హీరోల సినిమాలలో వరస అవకాశాలను దక్కించుకుంటూ కెరియర్ ని ముందుకు సాగిస్తున్నారు.


కృతి శెట్టి తాజాగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా సెప్టెంబర్ 16 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ మూవీ తో పాటు కృతి శెట్టి మరి కొన్ని సినిమాలలో కూడా అవకాశాలను దక్కించుకుంది . శ్రీ లీల ప్రస్తుతం మాస్ మహారాజ రవితేజ హీరోగా తిరకెక్కిన ధమాకా మూవీ లో హీరోయిన్ గా నటిస్తోంది. కేతికా శర్మ హీరోయిన్ గా నటించిన రంగ రంగ వైభవంగా సినిమా కొన్ని రోజుల క్రితమే విడుదల అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: