మహేష్ డైరెక్టర్ కి చైతూ సలహా..?

Anilkumar
ఏ ముహూర్తాన నాగచైతన్య - పరశురామ్‌ సినిమా..  అనుకున్నారో కానీ.. అప్పటి నుండి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. అయితే ఈ సినిమా ఇదిగో మొదలైపోతుంది అనుకుంటుండగా..ఆగిపోతూ వస్తోంది. తాజాగా మరోసారి ఈ సినిమా గురించి రూమర్లు వినిపిస్తున్నాయి. ఇక వీటి ప్రకారం అయితే దర్శకుడు పరశురమ్‌ ఈ సినిమా కోసం మరికొన్నాళ్లు స్టోరీ బోర్డు మీద కూర్చోవాలి. ఎందుకు అంటే సినిమా కథ విషయంలో నాగచైతన్య మార్పులు కాదు, ఏకంగా కథనే మార్చమన్నాడు అని అంటున్నారు.ఇకపోతే 'సర్కారు వారి పాట' సినిమా కంటే ముందు నాగచైతన్యతో పరశురామ్‌ ఓ సినిమా చేయాలి.

కాగా  ఈ సినిమాకు 'నాగేశ్వరరావు' అనే పేరు కూడా ఫిక్స్‌ చేశారు. ఇక అంతా ఓకే అనుకుని, త్వరలో ప్రారంభం అనుకోగా.. ఇంతలో మహేష్ బాబు నుండి పిలుపు రావడంతో పరశురామ్‌ అటు వెళ్లిపోయారు. ఇక దీంతో 'నాగేశ్వరరావు' ఆగిపోయింది. 'సర్కారు వారి పాట' అయిపోగానే మొదలుపెట్టేద్దాం అనే డీల్‌ కూడా అనుకున్నారని టాక్‌. కాగా అది కూడా ఇప్పుడు అవ్వడం లేదు.అయితే 'సర్కారు వారి పాట' ఫలితం విషయంలో పరశురామ్‌ ఎంతమేర సంతృప్తి కలిగిందో తెలియదు కానీ.. 'నాగేశ్వరరావు' విషయంలో నాగచైతన్య అయితే అంత హ్యాపీగా లేడని టాక్‌.ఇక  అందుకే ఈ సినిమాను కాస్త పక్కనపెట్టి వెంకట్‌ ప్రభు సినిమాను ఓకే చేసేశారు.

కాగా ఇప్పుడు ఆ సినిమా షూటింగ్‌ కూడా సాగుతోంది. అయితే ఆ తర్వాత అయినా పరశురామ్‌ సినిమా ఉంటుందా? అంటే.. అంత ఈజీగా తేలుతుంది అని చెప్పలేకపోతున్నారు. అయితే ఈ కారణం కథలో మార్పులు కోరడమే అని చెబుతున్నారు.ఇకపోతే 'నాగేశ్వరరావు' కథ కాస్త క్లాసీగా ఉందని, అలా కాకుండా మాస్‌ అంశాలు ఉంటే బాగుంటుందని నాగచైతన్య నుండి సజెషన్స్‌ వచ్చాయి అని చెబుతున్నారు.అయితే  క్లాస్‌ కథ కొంతవరకు 'గీత గోవిందం'లా ఉందనే అభిప్రాయాలు రావడమే దీనికి కారణం అని చెబుతున్నారు. ఇక దీంతో పూర్తిగా కొత్త కథ సిద్ధం చేస్తే బాగుంటుందని చైతు సూచించారట.కాగా  వెంకట్‌ ప్రభు సినిమా పూర్తయ్యేలోపు కథను సిద్ధం చేస్తే స్టార్ట్‌ చేద్దామని నాగచైతన్య అన్నారని టాక్‌ నడుస్తోంది.ఇక  అప్పుడు కూడా ఈ సినిమాకు అదే పేరు ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: