ఇటీవల డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన చిత్రం కార్తికేయ -2. ఇక ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది..అంతేకాదు ఎవరూ ఊహించని విధంగా కలెక్షన్లు కూడా రాబట్టింది.అయితే మొదటిసారిగా ఈ చిత్రంతో హీరో నిఖిల్ రూ.100 కోట్ల క్లబ్లో చేరారు. బాలీవుడ్ లో కూడా ఈ చిత్రం మంచి విజయ దిశగా దూసుకుపోతోంది. ఇందులో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ అద్భుతమైన నటనను ప్రదర్శించిందని చెప్పవచ్చు.ఇక దీంతో ఒక్కసారిగా వీరిద్దరి క్రేజీ పెరిగిపోయింది. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో చిత్ర బృందం ఎక్కువగా పాల్గొనడం చేత ఈ సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయింది అని చెప్పవచ్చు.
ఇకపోతే కార్తికేయ -2 చిత్రంతో ఇటు నిఖిల్, అటు అనుపమ కెరియర్ ఒక్కసారిగా టర్నింగ్ పాయింట్ అయిందని చెప్పవచ్చు. డైరెక్టర్ చందు ముండేటికి కూడా బాలీవుడ్ నుంచి సినిమా ఆఫర్లు వెలువడుతున్నట్లు సమాచారం. హీరో నిఖిల్ , అనుపమ పరమేశ్వరన్ కు కూడా ఇతర భాషల నుంచి ఆఫర్లు వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలోనే వీరిద్దరూ కూడా తమ రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతకు చుక్కలు చూపిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.అయితే నిఖిల్ కార్తికేయ-2 18 పేజీస్ సినిమాలకు తీసుకున్న రెమ్యూనరేషన్ కంటే డబుల్ రెమ్యునరేషన్ అడుగుతున్నట్లుగా సమాచారం.
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా గత సినిమాల పారితోషకం కంటే ఎక్కువ మొత్తంలోనే డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఇకపోతే కేవలం ఈ ఒక్క సినిమానే ఈ హీరో హీరోయిన్ల కెరియర్లను మలుపు తిప్పిందని అభిమానుల సైతం కామెంట్లు చేస్తున్నారు. అయితే అందుచేతనే వీరిద్దరూ రెమ్యూనరేషన్ లో మాత్రం కాంప్రమైజ్ కాలేదని చెప్పవచ్చు. 18 పేజీ సినిమా కూడా విజయం సాధిస్తే ఇక వీరి దూకుడుకు కల్లాలు వేయడం కష్టమవుతుంది ముఖ్యంగా పారితోషకం విషయంలో నిర్మాతలకు చుక్కలు చూపిస్తున్నారు. ఇండస్ట్రీలో సూపర్ హిట్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ జోడి పారితోషకం పెంచితే నిర్మాతల పరిస్థితి ఏంటా అని ఆలోచించే వారి సంఖ్య కూడా పెరిగిపోతుంది..!!